MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ నుంచి నాగ చైతన్య వరకు.. తమన్ ఫ్యామిలీకి రుణపడి ఉండాలి, పేరు వెనుక పెద్ద సీక్రెట్..

ఏఎన్నార్ నుంచి నాగ చైతన్య వరకు.. తమన్ ఫ్యామిలీకి రుణపడి ఉండాలి, పేరు వెనుక పెద్ద సీక్రెట్..

తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తెలుగు సినిమాకు మొట్టమొదట గుర్తింపు తెచ్చిన నటుడు ఆయన. అదే విధంగా తెలుగు సినిమా చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడంలో కీలక పాత్ర పోషించింది కూడా ఏఎన్నార్ అని చెప్పొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తెలుగు సినిమాకు మొట్టమొదట గుర్తింపు తెచ్చిన నటుడు ఆయన. అదే విధంగా తెలుగు సినిమా చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడంలో కీలక పాత్ర పోషించింది కూడా ఏఎన్నార్ అని చెప్పొచ్చు. వందలాది వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రతి ఒక్కరి కెరీర్ లో సహకరించిన, సాయం చేసిన వ్యక్తులు కొందరు ఉంటారు. ఏఎన్నార్ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏఎన్నార్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫ్యామిలీతో విడదీయరాని అనుబంధం ఉంది. అక్కినే నాగేశ్వరరావు నుంచి ప్రస్తుతం నాగచైతన్య , అఖిల్ వరకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం తమన్ కుటుంబానికి రుణపడి ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. 

Also Read : బాహుబలి 2 కట్టప్ప ట్విస్ట్ వల్ల హిట్ కాలేదు..ఆ ఒక్క సీన్ వల్లే, రాఘవేంద్రరావుకి నచ్చిన సన్నివేశం అదే

35

అక్కినేని నాగేశ్వరరావుని హీరోగా పరిచయం చేసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య. ఏఎన్నార్ లో ప్రతిభని గుర్తించిన ఘంటసాల బలరామయ్య 1942లో తాను తెరకెక్కించి శ్రీసీతారామ జననం చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఏఎన్నార్ హీరోగా కెరీర్ ప్రారంభించింది ఈ చిత్రంతోనే. ఆ తర్వాత ఏఎన్నార్ అనేక చిత్రాల్లో ఘంటసాల బలరామయ్య దర్శక నిర్మాణంలో నటించారు. 

Also Read: అమ్మకి ఇష్టం లేదు, అందుకే నాన్నని దూరం పెట్టా..విష్ణుప్రియ కుటుంబ కష్టాలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ

45

అలాంటి ఘంటసాల బలరామయ్య మనవాడే ఇప్పటి సంగీత దర్శకుడు తమన్. ఈ విషయాన్ని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రివీల్ చేశారు. బలరామయ్య కూడా తమన్ లాగే బాగా బొద్దుగా ఉండేవారు. ఆయన పోలికలే తమన్ కి వచ్చాయి అని సరదాగా నాగేశ్వర రావు తెలిపారు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ శివకుమార్. బలరామయ్య కొడుకు శివకుమార్.. ఆయన కొడుకే తమన్. సినిమాల్లోకి వచ్చాక తన పేరుని ఎస్ తమన్ గా మార్చుకున్నారు. ఎస్ అంటే తన తండ్రి పేరు శివకుమార్ అని అర్థం. తమన్ పేరు వెనుక అంత హిస్టరీ ఉంది. 

55
Thaman

Thaman

తమన్ తన కెరీర్ లో అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ చిత్రాలకు సంగీతం అందించారు. రగడ, గ్రీకువీరుడు, తడాఖా, అఖిల్ లాంటి చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. అదన్నమాట తమన్ ఫ్యామిలీకి ఏఎన్నార్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved