మీరు వర్జినేనా.. నెటిజన్ ప్రశ్నకు అదరిపోయే ఆన్సర్ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో
ఈమధ్య సోషల్ మీడియాలో విపరీత థొరణి పెరిగిపోయింది. నోటికి ఏది అనిపిస్తే అది అడిగేయడం ప్యాషనైపోయింది. హీరో హీరోయిన్ అన్న తేడా లేకుండా ఏ సర్టిఫికెట్ క్యాశ్యన్స్ అన్నీ అడిగేస్తున్నారు. రీసెంట్ గా అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.

సోషల్ మీడియాలో.. హీరో సుశాంత్ కు వింత అనుభవం ఎదురయ్యింది. సోషల్ మీడియా విసృతం అయినప్పటి నుంచి.. సెలబ్రెటీలకు సామాన్యులకు అంతరం చెరిగిపోతూ వస్తోంది. దానితో పాటు స్టార్స్ ఎప్పటికప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారు. వారితో చిట్ చాట్ లు చేస్తూ.. ఎంటర్టైన్ చేస్తున్నారు. వా టి ద్వారా.. సెలబ్రిటీలు కూడా వాళ్ల ఇమేజ్ ను ఇంకాస్త పెంచుకుంటూ.. ఫాలోయింగ్ ను డెవలెప్ చేసుకుంటున్నారు.
ఇక రీసెంట్ గా అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కూడా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూ.. ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ వస్తున్నాడు. రీసెంట్ గా షూట్ యువర్ క్వశ్చన్స్ అంటూ... నెట్టింట్లో.. అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు.
అయితే ఈ చిట్ చాట్ లో సుశాంత్ కు షాకింగ్ క్వశ్చన్ ఎదురయ్యింది. మీరు వర్జినేనా అని ఓ నెటిజన్ సుశాంత్ ను నేరుగా ప్రశ్నించారు. దానికి సుశాంత్ కూడా కూల్ గా.. తెలివిగా సమాధానం చెప్పాడు. ఓ వెలుగుతున్న దీపం బొమ్మను ఆన్సర్ గా చూపించాడు.
దీనికి రకరకాల ఆన్సర్లు వెతుక్కుంటున్నారు సోషల్ మీడియా జనాలు. సుశాంత్ తాను నిప్పు అనిచెప్పదలచుకున్నాడంటూ కొందరు.. కాదు అంటూ మరికొందరు.. ఇలా రకరకాలుగా సుశాంత్ సమాధానాన్ని అర్ధం చేసుకుంటున్నారు. ఇలా చిట్ చాట్ లో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి సుశాంత్ కు.
అల్లు అర్జున్ తో మళ్ళీ ఎప్పుడు నటిస్తారు అని ప్రశ్నించగా.. అలవైకుంఠపురములో2 ఎప్పుడు బన్నీ అంటూ అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశాడు సుశాంత్. అవకాశం వస్తే వెంటనే నటిస్తానని చెప్పాడు. ఇలా రకరకాల ప్రశ్నలకు సుశాంత్ సమాధాణం ఇచ్చాడు.
సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పెద్దగా సక్సస్ అవ్వలేకపోయాడు. చాలా కాలం గ్యాప్ తరువాత అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాతో సెకండ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా నటిస్తూనే.. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసురాలో నటిస్తున్నారు సుశాంత్.