- Home
- Entertainment
- చూడముచ్చటగా ఉండే తెలుగు అమ్మాయి దీపికా సర్ప్రైజింగ్ గ్లామర్ లుక్, టాలీవుడ్ లో మరో 'బేబీ' అయ్యే ఛాన్స్
చూడముచ్చటగా ఉండే తెలుగు అమ్మాయి దీపికా సర్ప్రైజింగ్ గ్లామర్ లుక్, టాలీవుడ్ లో మరో 'బేబీ' అయ్యే ఛాన్స్
టాలీవుడ్ యంగ్ యాంకర్ దీపికా పిల్లి గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అనేక షోలు చేస్తూ యాంకర్ గా గుర్తింపు పొందింది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా పిల్లికి కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ పై ఆసక్తి ఉండేది.

Deepika Pilli
టాలీవుడ్ యంగ్ యాంకర్ దీపికా పిల్లి గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అనేక షోలు చేస్తూ యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి క్రేజీ యాంకర్స్ ఉన్నారు. అయినప్పటికీ తన గ్లామర్, చలాకీతనంతో దీపికా పిల్ల పాపులర్ అయింది.
Deepika Pilli
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా పిల్లికి కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. అందుకు తగ్గట్లుగానే దీపికా నాజూకు లుక్ మైంటైన్ చేస్తూ వచ్చింది. బుల్లితెరకి అవకాశాలు రావడంతో యాంకర్ గా మారింది.
Deepika Pilli
ఢీ లాంటి క్రేజీ షోలలో కూడా దీపికా మెరిసింది. ఆ తర్వాత కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్, ఫ్యామిలీ స్టార్స్ లాంటి షోలు చేసింది. యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
Deepika Pilli
కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన దీపికా పిల్లి ఆ తర్వాత సుధీర్ తో కలసి వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో రొమాన్స్ పండించింది.
Deepika Pilli
ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలసి యాంకరింగ్ చేస్తోంది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది.
Deepika Pilli
తాజాగా మరోసారి దీపికా పిల్లి హీరోయిన్ గా నటించింది. యాంకర్ ప్రదీప్ తో కలసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే చిత్రంలో నటించింది. ఏప్రిల్ 11 న అంటే నేడు ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వస్తోంది.
Deepika Pilli
తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. ఇటీవల వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి అవకాశాలు అందుకుంటోంది. బేబీ చిత్రంతో వైష్ణవికి పాపులారిటీ దక్కింది.
Deepika Pilli
సరిగ్గా దృష్టి పెడితే దీపికా పిల్లి కూడా టాలీవుడ్ లో మరో బేబీ అయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ గా ఛాన్సుల కోసం దీపికా గ్లామర్ ఒలకబోసేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా దీపికా పిల్లి బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజింగ్ ఫోజులతో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.