అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ? కుండబద్దలు కొట్టిన రేణు దేశాయ్..
పవన్ కళ్యాణ్ తనకొడుకు అకీరా నందన్‌ని ఇటీవల బాగా ప్రమోట్ చేసిన నేపథ్యంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీనిపై రేణు దేశాయ్ స్పందించింది. కుండబద్దలు కొట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవలే ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సక్సెస్ ఆనందాన్ని పవన్ తన ఫ్యామిలీతో కలిసి పంచుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ తన భార్య, కొడుకు అకీరాని ఫోకస్ చేస్తున్నాడు. ఓ రకంగా కొడుకు అకీరాని ప్రమోట్ చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం అనంతరం చంద్రబాబుని కలిసే సమయంలోనూ తన భార్య అన్నా కొణిదెలతోపాటు కొడుకు అకీరాని తీసుకెళ్లాడు. చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నాడు. అంతేకాదు ప్రధాని మోడీని కలిసిన సమయంలోనూ అకీరాని తీసుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ అకీరా వైపు మళ్లింది. త్వరలోనే ఆయన్ని హీరోగా పరిచయం చేయబోతున్నారని అందులో భాగంగానే కొడుకుని ప్రమోట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై తల్లి రేణు దేశాయ్ స్పందించింది. ఇటీవల ఆమె ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ముచ్చటిస్తూ అకీరా నందన్ హీరోగా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఓ విషయాన్ని స్పష్టం చేసింది. అకీరా సినిమాలు చేయడం లేదని, ఆయనకు ఇప్పుడే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. యాక్టింగ్ కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కూడా తాను ఆసక్తి చూపించేవాడు కాదని, ప్రస్తుతానికి సినిమాల్లోకి రావాలనే ఆసక్తి అకీరాకి లేదని తెలిపింది రేణు దేశాయ్.
వాళ్ల నాన్న గెలుస్తున్నాడని తెలిసి పవన్ దగ్గరికి వెళ్లిపోయాడని, ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడని తెలిపింది. అంతేకానీ సినిమాల్లోకి రావాలని, అందుకే ప్రమోట్ చేస్తున్నారనేది నిజం కాదని తెలిపింది రేణు దేశాయ్. తన వరకు అకీరా ఏం కావాలనేది తన ఇష్టం అని, భవిష్యత్‌లో సినిమాల్లోకి వస్తే కచ్చితంగా దాన్ని నేనే అధికారికంగా ప్రకటిస్తానని, దాన్ని బ్యాండ్ బాజా బారత్ లెవల్లో అనౌన్స్ చేస్తానని, అది తన లైఫ్‌లో అత్యంత ఆనందకరమైన రోజు అవుతుందని తెలిపింది రేణు దేశాయ్. హీరోగా చూడాలని తనకు కూడా ఉందనే ఆసక్తిని వ్యక్తం చేసింది రేణు దేశాయ్.
అంతేకాదు ఈ సందర్భంగా రేణు దేశాయ్.. తాను రెండో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు ఏళ్లలో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని, అందుకు తమ పిల్లలు అకీరా, ఆద్యలు కూడా పాజిటివ్‌గా ఉన్నారని చెప్పింది. రేణు దేశాయ్ మరో ఆసక్తిని వెల్లడించింది. డైరెక్షన్ చేయాలని ఉందని, భవిష్యత్‌లో ఆ ప్రయత్నం కూడా చేస్తానని చెప్పింది రేణు దేశాయ్.