MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అకీరా నందన్ డీప్‌ఫేక్ వీడియో, పవన్ కళ్యాణ్ తనయుడికి తప్పని తిప్పలు, కోర్టును ఆశ్రయించిన స్టార్ కిడ్

అకీరా నందన్ డీప్‌ఫేక్ వీడియో, పవన్ కళ్యాణ్ తనయుడికి తప్పని తిప్పలు, కోర్టును ఆశ్రయించిన స్టార్ కిడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందర్ కి కూడా సోషల్ మీడియాలో తిప్పలు తప్పడంలేదు. మెగా స్టార్ కిడ్ కూడా డీప్‌ఫేక్ వీడియో బాధితుడిగా మారిపోయాడు. ఈ విషయంలో హైకోర్టు ను ఆశ్రయించాడు అకీరా.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 25 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ తనయుడికి తప్పని తిప్పలు..
Image Credit : Asianet News

పవన్ తనయుడికి తప్పని తిప్పలు..

ఈమధ్య సెలబ్రిటీలకు ఏఐ తిప్పలు తప్పడంలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిస్ యూజ్ చేసి.. రకరకాల డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. సెలబ్రిటీల పరువు తీసేవిధంగా వాటిని వైరల్ చేస్తున్నారు. సినీ,రాజకీయ ప్రముఖుల తోపాటు.. స్టార్ కిడ్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో బాధితులుగా మారిపోతున్నారు. రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ ను లక్ష్యంగా చేసుకుని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కంప్లైయింట్ రావడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోర్డును ఆశ్రయించిన అకీరా నందన్
Image Credit : our own

కోర్డును ఆశ్రయించిన అకీరా నందన్

ఈ డీప్‌ఫేక్ వీడియోల కారణంగా తమ వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడిందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కోర్టుమెట్టు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అకీరా నందన్ కూడా ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సంబంధించిన కంటెంట్‌ను డీప్‌ఫేక్ వీడియోలుగా సృష్టించి అనుమతి లేకుండా ప్రచారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. అలాగే తన పేరు, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను దుర్వినియోగం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

35
నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Image Credit : Asianet News

నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అకీరా వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని వేగంగా స్పందించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడు అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగించి తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేశాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో  ప్రచారం చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత గోప్యతకు , భద్రతకు ముప్పు కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్యలు తీవ్రమైన సైబర్ నేరాల కిందకు వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

45
సెలబ్రిటీలలో ఆందోళన..
Image Credit : face book / Mega fanc

సెలబ్రిటీలలో ఆందోళన..

ఈ మధ్య కాలంలో ఏఐని ఉపయోగించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వీడియోలను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫిల్మ్ స్టార్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండా ఇలా వాడినివారిపై చర్చలు తీసుకోవాలని, ఇక ముందు తమ అనుమతి లేకుండా.. ఫోటోలు, వీడియోలు వాడకుండా.. చూడాలని వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈమధ్య కాలంలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కమల్ హాసన్, రజినీకాంత్ , అమితాబచ్చన్ లాంటి స్టార్స్ చాలామంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారికి పాజిటీవ్ గా తీర్పు కూడా వచ్చింది.

55
అధికారుల హెచ్చరిక..
Image Credit : Asianet News

అధికారుల హెచ్చరిక..

పోలీసుల ప్రకారం, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీలు , ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పేర్లతో ఫేక్ వీడియోలు సృష్టించడం చాలా పెద్ద నేరం. ఇలాంటి పనులు చేసేవారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి అనుమానాస్పద కంటెంట్‌ను చూసిన వెంటనే షేర్ చేయకుండా.. సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇక ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని... వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
Recommended image2
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం
Related Stories
Recommended image1
చిరంజీవి ఇంట్లో రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలుసా? మెగాస్టార్ గురించి షాకింగ్ నిజం వెల్లడించింది ఎవరు?
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాకుండా.. ఫిల్మ్ ఇండస్ట్రీ దేవుడిలా చూసిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved