సమంత మయోసైటిస్ వ్యాధిపై అఖిల్ కామెంట్స్.. స్పందిస్తున్న అక్కినేని ఫ్యామిలీ..
సమంత సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించగానే చిత్ర పరిశ్రమ ఒక్క సరిగా ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది.

సమంత సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించగానే చిత్ర పరిశ్రమ ఒక్క సరిగా ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది.
లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. మయోసైటిస్ అంటే ఏమిటి.. అసలు ఆ వ్యాధి ఎలాంటి వారికి సోకుతుంది అంటూ నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఈ వ్యాధి కండరాలపై ప్రభావంచూపిస్తుంది. ఫలితంగా ఈ వ్యాధి సోకిన వారు ఎక్కువగా నీరసంగా ఉంటారు. చర్మంపై కూడా ప్రభావం ఉంటుంది.
ఇంకా పూర్తిగా కోలుకోనప్పటికీ త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయట పడతానని సమంత తెలిపింది. తనకి విధి వరుసగా సవాళ్లు విసురుతోంది అని.. అన్ని సమస్యలని దాటుకుని వెళుతున్నానని తెలిపింది. ఈ వ్యాధిని కూడా అధికమిస్తానని పేర్కొంది.
సెలెబ్రిటీలు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. సాయిధరమ్ తేజ్, రామ్ పోతినేని, జూ.ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి ఇలా సెలెబ్రిటీలు వరుసగా సమంత ఈ వ్యాధి నుంచి బయట పడాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమంత కోలుకోవాలని విష్ చేయడం విశేషం. అఖిల్ అక్కినేని సమంత పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు. 'అందరి ప్రేమ అభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి సామ్ ' అంటూ అఖిల్ పోస్ట్ పెట్టాడు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని విష్ చేశాడు. ఈ వ్యాధిని అధికమించే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి సామ్ అంటూ సుశాంత్ కామెంట్ పెట్టాడు. త్వరలో సమంత నటించిన యశోద చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తోంది.