MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..

Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..

రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ఫేమస్ అయ్యాడు హీరో నిఖిల్ రాజ్. తాజాగా ఆయన ఓ డెలివరీ బాయ్ తో గొడవపడటం వివాదంగా మారింది. ఈ విషయంలో అసలు నిజానిజాలేంటో తెలుపుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరో నిఖిల్ రాజ్ వివాదం..
Image Credit : facebook.com/AkhilRaj.Uddemari

హీరో నిఖిల్ రాజ్ వివాదం..

రాజు వెడ్స్ రాంబాయి, ఈషా సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు పొందిన అఖిల్ రాజ్‌కు సంబంధించిన ఒక వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో, పూర్తి వివరాలు తెలియకుండానే పలువురు సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అఖిల్ రాజ్ తాజాగా ఓ వీడియో విడుదల చేసి ఘటనపై తన వివరణ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు విషయం ఏంటో చెప్పిన తెలుగు హీరో..
Image Credit : facebook.com/AkhilRaj.Uddemari

అసలు విషయం ఏంటో చెప్పిన తెలుగు హీరో..

అఖిల్ రాజ్ మాట్లాడుతూ, ''రమేష్ అనే డెలివరీ బాయ్ తమ ఇంటికి పొరపాటున ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు, ఆ ఆర్డర్ తమ ఇంటికి కాకుండా ఎదురుగా ఉన్న ఫ్లాట్‌కు ఇవ్వాల్సి ఉంది. అయితే అడ్రస్‌లో "అరుణ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న ఫ్లాట్" అని ఉండగా, డెలివరీ బాయ్ దానిని అరుణ రెసిడెన్సీలోని తమ 201 ఫ్లాట్‌కు తీసుకొచ్చాడు. ఆ సమయంలో తమ తండ్రి ఆ ఆర్డర్‌ను తీసుకున్నారు, అది ఎవరు ఆర్డర్ చేశారో అడిగేలోపే డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం మా అమ్మ అది తమ ఇంటికే వచ్చిన ఆర్డర్ అనుకుని ప్యాకెట్‌ను తెరిచారు. అని అఖిల్ అన్నారు.

Related Articles

Related image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Related image2
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
35
అమ్మను తిడితే ఎవరికైనా కోపం వస్తుందిగా?
Image Credit : facebook.com/AkhilRaj.Uddemari

అమ్మను తిడితే ఎవరికైనా కోపం వస్తుందిగా?

అఖిల్ మాట్లాడుతూ.. దాదాపు 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ తిరిగి వచ్చి ఆ ఆర్డర్ గురించి అడిగాడు. డెలివరీ ఇచ్చే సమయంలో అడ్రస్‌ను సరిచూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా అని నేను ప్రశ్నించగా, అతను "చూసుకోలేదు, ఇలాగే ఇస్తాను" అన్నట్లు మాట్లాడాడు. అంతే కాదు అతను ఆల్కాహాల్ తీసుకున్నట్టు కూడా అనిపించింది. అప్పుడు మా అమ్మ జరిగిన విషయం వివరించి, తెలియక ప్యాకెట్ తెరిచామని చెబుతూ తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించగా, డెలివరీ బాయ్ ఆమెను కూడా దూషించాడు. అమ్మపై అనుచితంగా మాట్లాడడంతో ఒక కొడుకుగా నాకు కోపం వచ్చిందని'' అఖిల్ రాజ్ అన్నారు.

45
ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారంటూ నెటిజన్లకు ప్రశ్న..?
Image Credit : facebook.com/AkhilRaj.Uddemari

ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారంటూ నెటిజన్లకు ప్రశ్న..?

"నేను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పని చేసిన వ్యక్తినే. ఆ ఉద్యోగం విలువ నాకు తెలుసు. కానీ ఈ ఘటనలో డెలివరీ బాయ్ తప్పు చేశాడు. మా అమ్మను దూషించాడు. నిజాలు తెలియకుండా అందరూ నన్నే తప్పుబడుతున్నారు. అతను వెళ్లే సమయంలో వీడియో తీసుకుంటూ 'నువ్వు హీరో కదా... వైరల్ చేస్తాను' అని అన్నాడు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా స్పందించకుండా ఉంటారా?" అని అఖిల్ నెటిజన్లను ప్రశ్నించారు.

55
పోలీసులకు కంప్లైంట్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Image Credit : facebook.com/AkhilRaj.Uddemari

పోలీసులకు కంప్లైంట్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..

తాను డెలివరీ బాయ్‌ను కొట్టలేదని కూడా అఖిల్ రాజ్ స్పష్టం చేశారు. "నేను కొట్టానంటే ఆ వీడియోలో చూపించండి. మా ఇంటికి సంబంధించినది కాని ఆర్డర్ తీసుకొచ్చి, తర్వాత వచ్చి మా కుటుంబ సభ్యులతో ఇష్టానుసారంగా మాట్లాడడం సరైంది కాదు" అని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అఖిల్ రాజ్ వెల్లడించారు. "నేను తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతాను. కానీ నిజం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించండి. ఎవరో షేర్ చేసిన ఒక్క వీడియో ఆధారంగా నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను విమర్శించడం సరికాదు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image2
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved