వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండలా పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్న అఖిల్..?
ఈ మధ్య గత సినిమాలు పాటు,టైటిల్స్, స్టోరీస్, డైలాగ్స్.. కొత్త సినిమాల కోసం ఎక్కువగా వాడేస్తున్నారు. యంగ్ హీరోల ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అఖిల్ అక్కినేని కూడా జాయిన్ అయ్యాడు.

అఖిల్ అక్కినేని సినిమా కోసం ఓ ప్రయోగం చేయబోతున్నారు. ఈ మధ్య యంగ్ హీరోలంతా చేస్తున్న ప్రయోగాన్ని ఇప్పుడు అఖిల్ ఫాలో అవ్వబోతున్నాడు. అది కూడా ఇద్దరు యంగ్ హీరోలు అయిన వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండల ప్రయోగాన్ని తాను ఫాలో అవ్వబోతున్నాడు.
పవన్ కల్యాణ్ అంటేనే కాదు.. ఆయన టైటిల్ అంటే కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన సినిమా టైటిల్స్ కి కూడా ఒక ఇమేజ్ .. ఒక క్రేజ్ ఉంటాయి. అందుకే ఈ మధ్య యంగ్ హీరోలు పవర్ స్టార్ టైటిల్స్ ను వాడటం మొదలు పెట్టారు. ఆ టైటిల్ తో క్రేజ్ పెరుగుతుందని.. ఫ్యాన్స్ లో దూసుకుపోతుందని అభిప్రాయం.
గతంలో చాలా మంది చాలా సినిమాల టైటిల్స్ ను తమ సినిమాల కోసం వాడుకున్నారు. అందులో ఈమధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్స్ ను ఎక్కువగా వాడి హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందులో ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉండగా.. ఆతరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.
పవన్ టైటిల్ తొలిప్రేమ తో వరుణ్ తేజ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు బాగా ప్లాస్ అయ్యింది. ఇక అదే ఫాలో అవుతూ.. పవన్ టైటిల్ తో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇక అక్కినేని వారసుడు అఖిల్ కూడా పవన్ టైటిల్ తోనే తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది..
అఖిల్ అక్కినేని వేణు శ్రీరామ్ తో సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్. ఈ సినిమాకు పవర్ స్టార్ హిట్ మూవీ తమ్ముడు టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మరో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
1999లో పవన్ హీరోగా వచ్చిన తమ్ముడు ఆయన కెరియర్ లో హిట్ సినిమాల్లో ఒకటి. అన్నాతమ్ముళ్ల సెంటిమెంట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. నేపథ్యంలో వేణు శ్రీరామ్ కూడా అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెకిస్తారని టాక్.
అందుకే పవర్ స్టార్ తమ్ముడు టైటిల్ ను సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అఖిల్ తాజా సినిమా ఏజెంట్ రిలీజ్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం.