- Home
- Entertainment
- గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని పెళ్లి, హాజరైన అతిథులు వీరే, బరాత్‌లో చైతూ, సుశాంత్, కార్తికేయ రచ్చ
గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని పెళ్లి, హాజరైన అతిథులు వీరే, బరాత్‌లో చైతూ, సుశాంత్, కార్తికేయ రచ్చ
అఖిల్ అక్కినేని పెళ్లి జైనబ్ రవ్‌డ్జీతో గ్రాండ్‌గా జరిగింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని పెళ్లి
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనాబ్ రవ్ డ్జీని వివాహం చేసుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఈ ఇద్దరు శుక్రవారం(జూన్ 6) ఉదయం ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మ్యారేజ్ చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ లోని నాగార్జున కొత్త ఇంట్లో అఖిల్ పెళ్లి
జూబ్లీహిల్స్ లోని నాగార్జున కొత్త ఇంట్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. దీనికి అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. కేవలం దగ్గరి బంధువులు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి నాగ్‌కి క్లోజ్ గా ఉన్న వాళ్లు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది.
అఖిల్ పెళ్లికి హాజరైన అతిథులు
అందులో భాగంగా చిరంజీవి, సురేష్, రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. వీరితోపాటు దగ్గుబాటి ఫ్యామిలీ అటెండ్ అయినట్టు తెలుస్తుంది. వెంకటేష్, రానా, సురేష్ బాబు వంటివారు ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. వీరికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అఖిల్, జైనబ్‌ల పెళ్లి ఫోటో ఇంకా బయటకు రాకపోవడం గమనార్హం.
పూర్తి ప్రైవేట్‌గా అఖిల్ పెళ్లి
నాగార్జున తన కొడుకు అఖిల్ పెళ్లిని పూర్తి ప్రైవేట్ సెర్మనీలో నిర్వహిస్తున్నారు. ఎలాంటి మీడియా కవరేజీకి అనుమతివ్వలేదు. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు ఏవీ బయటకు రావడం లేదు. ఇదిలా ఉంటే ఈ పెళ్లి జరిగినట్టుగా అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నాగార్జున పెళ్లి ఫోటోని పంచుకునే అవకాశం ఉంది.
అఖిల్ ప్రీ వెడ్డింగ్‌లో సందడి చేసిన అక్కినేని ఫ్యామిలీ
అయితే ఇప్పటికే సందడిగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. ఇక పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, అక్కినేని వెంకట్, నాగసుశీల, సుప్రియా, వారి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు.
తమ్ముడి పెళ్లిలో అన్న చైతూ హంగామా
ఇందులో యంగ్ హీరోలు సందడి చేశారు. తమ్ముడు పెళ్లిని నాగచైతన్య బాగా ఎంజాయ్ చేశారు. ఆయన బరాత్ కార్యక్రమంలో డాన్సులతో రెచ్చిపోయారు. ఆయనతోపాటు సుశాంత్ కూడా అదరగొట్టాడు. ఆయన డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ అఖిల్ పెళ్లి బరాత్‌లో డాన్సులు చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
జూన్ 8న గ్రాండ్‌గా అఖిల్, జైనబ్‌ల రిసెప్షన్
ఇక ఈనెల 8న(ఆదివారం) సాయంత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారట నాగార్జున. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా పాల్గొనే అవకాశం ఉందట.
అఖిల్ ప్రస్తుతం `లెనిన్` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. విడుదలకు రెడీ అవుతుంది.