MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖిల్ అక్కినేని మ్యారేజ్ డేట్ ఫిక్స్.. కొడుకు పెళ్లి కోసం నాగార్జున ఇప్పటి నుంచే ఏం చేస్తున్నాడో తెలుసా

అఖిల్ అక్కినేని మ్యారేజ్ డేట్ ఫిక్స్.. కొడుకు పెళ్లి కోసం నాగార్జున ఇప్పటి నుంచే ఏం చేస్తున్నాడో తెలుసా

అఖిల్ అక్కినేని గత ఏడాది నవంబర్ లో తనకి కాబోయే జీవిత భాగస్వామిని అధికారికంగా ప్రకటించారు. అఖిల్, జైనాబ్ రావ్జీ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న వీరిద్దరికీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 20 2025, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అఖిల్ అక్కినేని గత ఏడాది నవంబర్ లో తనకి కాబోయే జీవిత భాగస్వామిని అధికారికంగా ప్రకటించారు. అఖిల్, జైనాబ్ రావ్జీ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న వీరిద్దరికీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. అఖిల్, శోభిత వివాహానికి కొద్దిరోజుల ముందు ఈ ప్రకటన చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Akhil Akkineni

Akhil Akkineni

అప్పటి నుంచి జైనాబ్ ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. అఖిల్ కి కాబోయే సతీమణి జైనాబ్.. జుల్ఫీ రావ్జి అనే పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలిసింది. ఆమె వేల కోట్లకి వారసురాలు. అక్కినేని నాగార్జున, జుల్ఫీ  ఇద్దరూ బిజినెస్ లో భాగస్వాములుగా ఉన్నారట. అలా కుటుంబాల ద్వారా ఏర్పడ్డ పరిచయంతో అఖిల్, జైనాబ్ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఆ విధంగా నిశ్చితార్థం తంతు ముగిసింది. 

35

తాజాగా ఇరువురి కుటుంబ సభ్యులు అఖిల్, జైనాబ్ వివాహ వేడుక తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 24న అంగరంగ వైభవంగా అఖిల్ పెళ్లి వేడుక జరగనుందట. నాగార్జున ఇప్పటి నుంచే పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు అఖిల్ తన పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగాలని కోరుకుంటున్నాడట. తన తాత ఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ తనకి సెంటిమెంట్ అని అఖిల్ భావిస్తున్నాడు. నాగ చైతన్య, శోభిత పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. 

45

అఖిల్ పెళ్లి చాలా గ్రాండ్ గా ఉండేలా నాగార్జున ఏర్పాట్లు మొదలు పెట్టారు. సినీ రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, వ్యాపార వేత్తలు ఇలా ప్రతి రంగం నుంచి అతిథులు హాజరయ్యేలా ప్లానింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. పెళ్లి వేదిక గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసి.. రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే అక్కినేని ఫ్యామిలీ స్పందించాలి. 

55

మొత్తంగా అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్ద అమ్మాయి అని కూడా గతంలో ప్రచారం జరిగింది. ఇక కెరీర్ పరంగా అఖిల్ ప్రస్తుతం రెండు చిత్రాల ప్లానింగ్ లో ఉన్నారు. ఒక చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved