MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda on OTT: బాలయ్యా మజాకా, మామూలు రచ్చ కాదు.. ఓటిటి రికార్డుల తాట తీస్తున్న అఖండ

Akhanda on OTT: బాలయ్యా మజాకా, మామూలు రచ్చ కాదు.. ఓటిటి రికార్డుల తాట తీస్తున్న అఖండ

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 22 2022, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. ఇటీవల కాలంలో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్  హిట్ గా నిలిచిన చిత్రం అఖండ.  బాలయ్యని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యారు. బాలయ్య అఘోర గెటప్ అయితే ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలయ్య రోరింగ్ పెర్ఫామెన్స్ కి తోడు సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. థియేటర్స్ లో తిరుగులేని ప్రదర్శన తర్వాత అఖండ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. జనవరి 21 నుంచి అఖండ చిత్రం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడం మొదలు పెట్టింది. థియేటర్స్ లో అఖండ చిత్రానికి మోతెక్కిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించారు. 

36

కానీ అంచనాలని మించిపోయే స్థాయిలో అఖండ చిత్రానికి ఓటిటిలో రెస్పాన్స్ దక్కుతోంది. అఖండ ధాటికి ఓటిటి రికార్డులు గల్లంతవుతున్నాయి. ఓటిటిలో విడుదలైన 24 గంటల లోపే అఖండ చిత్రాన్ని 1 మిలియన్ పైగా వ్యూస్ దక్కాయి. 24 గంటల వ్యవధిలో ఓటిటిలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు చిత్రంగా అఖండ రికార్డ్ సృష్టించింది. 

46
Akhanda

Akhanda

ఓటిటిలో చూసిన వారంతా థియేటర్ లో కలిగిన గూస్ బంప్స్ ఇక్కడ కూడా ఫీల్ అవుతున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని కోట్ చేస్తున్నారు. బాలయ్య ఈ చిత్రాల్లో రాయలసీమ వ్యక్తిగా, అఘోరగా అద్భుతంగా నటించాడు. 

56

బోయపాటి ఈ చిత్రంలో పర్యావరణ కాలుష్యం, దైవత్వం లాంటి అంశాలని చక్కగా జోడించారు. యాక్షన్ సన్నివేశాల్లో బోయపాటి బాలయ్యని తనదైన శైలిలో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. దీనికి తోడు తమన్ బిజియం అదిరిపోవడంతో చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ బాలయ్యని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూశారు. 

66

ఇక ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ పరంగా విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని బోయపాటి ప్రకటించడం కొసమెరుపు. ఇటీవల అఖండ మూవీ అర్థ శత దినోత్సవం పూర్తి చేసుకుంది.  

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved