AKHANDA- ACHARYA : అఖండ ఎఫెక్ట్... చిరు ఆచార్య రీషూట్..?
అఖండ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆచార్య విషయంలో ఆలోచనలో పడ్డారట మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య సినిమాలో ఎటువంటి మార్చులు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట. రీ షూట్ కు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అఖండ విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అఖండ అఘోర పాత్రలో దేవుడికి సంబంధించిన సీన్లు దుమ్ము రేపాయి. బాలయ్య కూడా ఈ పాత్రలో అదరగొట్టాడు.
ఇప్పుడు ఈ సినిమా చూసిన తరువాత చిరంజీవి తన ఆచార్య విషయంలో ప్రెషర్ ఫీల్ అయినట్టుగా టాలీవుడ్ వర్గాల వినికిడి..! ఆచార్య కూడా ఒకింత డివోషనల్ బ్యాక్ డ్రాప్ దేవుడు, ధర్మ యుద్ధం అనే కాన్సెప్ట్ లతో ఉన్న సినిమా. ఈ నేపథ్యంలో సినిమా ఫ్లాట్ గా ఉందని చిరు భావించి కొరటాలను తిరిగి రమ్మన్నట్టుగా చెబుతున్నారు.
కొరటాల ఎన్టీఆర్ సినిమా పనిలో నిమగ్నమైపోయినప్పటికీ... వెనక్కి పిలిపించి స్క్రిప్ట్ మీద కొంత వర్క్ చేసి గూస్ బంప్స్ తెప్పించే లెవెల్ ఎలివేషన్ ఉండాలని చిరు అన్నారట. సినిమా విడుదల ఫిబ్రవరిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అఖండ తో పోలికలు బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద రివర్క్ చేసి స్క్రిప్ట్ ఫ్లాట్ గా లేకుండా చూడాలని అన్నారట.
అయితే ఆచార్య సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలల పైనే టైమ్ ఉంది. ఈలోపు స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి, కొన్ని సీన్స్ రీషూట్ చేయడానికి సరిపోను సమయం ఉంది. సినిమాలో ఎలివేషన్ లెవెల్ వర్క్ ఉండాలంటే.. చెర్రీ, చిరు ల కాంబినేషన్ సీన్స్ నే బాగా చూపెట్టాల్సి ఉంటుంది. అంటే రామ్ చరణ్ డేట్స్ కూడా అవసరం అవుతాయి.
కానీ రానున్న రోజుల్లో RRR ప్రొమోషన్స్ పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. ఈ పరిస్థితుల్లో చరణ్ ఎంత మేర సమయం దీనికి కేటాయించగలుగుతాడు..? షూట్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు అనే విషయం మీద అవుట్ కం ఆధారపడి ఉంటుంది.