బాలయ్య నుంచి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్.. మహా కుంభమేళలో `అఖండ2` ప్రారంభం
బాలకృష్ణ `డాకు మహారాజ్`తో హిట్ టాక్ అందుకున్నాడు. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్నారు. `అఖండ2` షూటింగ్ మహాకుంభమేళలో ప్రారంభం కావడం విశేషం.
AKHANDA 2
బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో హిట్ కొట్టాడు. ఇప్పుడు `డాకు మహారాజ్`తో మరో హిట్ అందుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ విజయవంతంగా రన్ అవుతుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి బాలయ్యకి మంచి బ్లాక్ బస్టర్ లోడింగ్ కాబోతుందని చెప్పొచ్చు.
డబుల్ హ్యాట్రిక్‌కి పునాది పడింది. `డాకు మహారాజ్` దానికి ఆద్యం పోసింది. ఇప్పుడు మరో హిట్ లోడ్ కాబోతుంది. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన `అఖండ`కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఇప్పుడు రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. అది కూడా మహా కుంభమేళాలో `అఖండ2ఃతాండవం` ప్రారంభం కావడం విశేషం. దీంతో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ కాబోతుందని చెప్పొచ్చు.
ఇక ఈ మూవీ విశేషాలు చూస్తే, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన `సింహా`, `లెజెండ్`, `అఖండ` సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు `అఖండ 2` సైతం వాటిని మించి ఉండబోతుందని తెలుస్తుంది.
అఘోర పాత్ర ప్రధానంగా సాగుతుందని, శివ తత్వాన్ని చెప్పబోతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో ప్రకృతికి సంబంధించిన అంశాలు, దేవుడికి ముడిపెడుతూ అనేక విషయాలను ఇందులో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది.
South Indian Films Releasing in 2025
హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను తెరకెక్కుతున్నారు. ఈ మూవీకి బాలయ్య చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తుండటం విశేషం. ఇటీవల ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ జోరు పెంచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
'అఖండ 2' న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ఈరోజు ప్రారంభమైయింది. మూవీ యూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలని మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది.
ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను `అఖండ 2` ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందులో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటించబోతుంది. ఆమెతోపాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
also read: `డాకు మహారాజ్` ఫస్ట్ డే కలెక్షన్లు, చిరంజీవి రికార్డులు బ్రేక్.. బాలయ్య దెబ్బ మామూలుగా లేదుగా!