ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్, అవకాశాల కోసమే అంటూ ట్రోలింగ్
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్రంలో నటిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రగ్యా జైస్వాల్ కంచె చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు పొందింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఆ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ట్రెడిషనల్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రగ్యా జస్వాల్ కి అవకాశాలు దక్కాయి. గుంటూరోడు, జయ జానకి నాయక, నక్షత్రం లాంటి చిత్రాలలో ప్రగ్యా జైస్వాల్ నటించింది కానీ ఆమెకి హిట్ మూవీ పడలేదు. ప్రగ్యా జైస్వాల్ కి ఫస్ట్ బ్రేక్ లభించింది బాలకృష్ణ అఖండ చిత్రంతోనే.
అఖండ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అఖండ మూవీ హిట్ అయినప్పటికీ మంచి అవకాశాలు రాలేదు. తిరిగి మళ్లీ బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ మూవీ కూడా విజయం సాధించింది.
కానీ దర్శకులు ఎందుకనో ప్రగ్యా జైస్వాల్ ని తమ చిత్రాల్లో తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అందం అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైస్వాల్. అవకాశాలు రావడం లేదని ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో శృతించేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. బికినీలో కనిపిస్తున్న ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ మోనోకిని ధరించి గ్లామరస్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ప్రగ్యా జైస్వాల్ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామరస్ గా కనిపిస్తోంది.
దీంట్లో నెటిజన్లు కొందరు ప్రగ్యా జైస్వాల్ ని ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు అవకాశాల కోసమే ప్రగ్యా జైస్వాల్ ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మరోసారి బాలకృష్ణ సరసన అఖండ 2 చిత్రంలో నటిస్తోంది.