MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అజిత్ డిలే చేయటమే రామ్ చరణ్ కు కలిసొస్తుందా?

అజిత్ డిలే చేయటమే రామ్ చరణ్ కు కలిసొస్తుందా?

అజిత్ నటించిన  విడాముయార్చి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని అక్కడ మీడియా అంటోంది. 

2 Min read
Author : Surya Prakash
Published : Dec 31 2024, 07:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ajith, Vidaamuyarchi, ram Charan, Game Changer

Ajith, Vidaamuyarchi, ram Charan, Game Changer


సంక్రాంతి సినిమాలు తెలుగు తో పాటు, తమిళంలో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ సీజన్ లో  ఇక్కడ సినిమాలు అక్కడ తమిళంలోనూ, అక్కడ సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతూంటాయి. ఆయా స్టార్ హీరోల క్రేజ్ ని బట్టి థియేటర్స్ ,పోటీ ఉండటం జరుగుతుంది. ప్రతీ సంక్రాంతిలాగే ఈ సారి కూడా స్టార్స్ సినిమాలు తమిళంలోనూ,తెలుగులోనూ పోటీ పడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఈ సంక్రాంతికి  అన్ని సినిమాల కంటే ముందుగా గేమ్ ఛేంజ‌ర్(Game Changer)రిలీజ్ అవుతోంది. ఈ  సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో  సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వ‌స్తే ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయ‌ని అంద‌రూ ఫిక్సైపోయారు. అయితే తమిళంలో భారీ రిలీజ్ కు మాత్రం అజిత్ అడ్డం తగులుతున్నారు. 

36


తెలుగులో ఎలాంటి సమస్యా లేదు కానీ త‌మిళంలో మాత్రం చ‌ర‌ణ్(charan) సినిమా అజిత్(Ajith) సినిమాతో డైరెక్ట్ క్లాష్ అయ్యే ఛాన్సున్న‌ట్లు తెలుస్తోంది. అజిత్ న‌టించిన విడాముయార్చి(Vidamuyarchi)ని కూడా జ‌న‌వ‌రి 10కే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తమిళ వ‌ర్గాల స‌మాచారం. అదే జ‌రిగితే గేమ్ ఛేంజ‌ర్ త‌మిళ వెర్ష‌న్ కు స్క్రీన్ల్ ప‌రంగా ఇబ్బందులు త‌ప్ప‌వు. కానీ ఇప్పుడు సీన్ మారే పరిస్దితి వస్తోంది.

46


అజిత్ నటించిన  విడాముయార్చి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని అక్కడ మీడియా అంటోంది. స్లోగా ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతూండటం ఈ న్యూస్ కు బలం చేకూరుస్తోంది. అయితే ఎంతవరకూ ఈ సిట్యువేషన్ గేమ్ ఛేంజర్ సినిమాకు ప్లస్ అవుతుందనేది వేచి చూడాల్సిన అంశం.
 

56


 విడాముయార్చి చిత్రం ఇప్పటిదాకా సెన్సార్ పూర్తి కాలేదు. న్యూ ఇయిర్ కు విడుదల అవుతుందంటున్న  విడాముయార్చి ట్రైలర్ సైతం పోస్ట్ ఫోన్ కావచ్చు అంటున్నారు. అదే జరిగితే ప్రమోషన్స్ పెద్దగా లేకుండా సినిమా రిలీజ్ చేయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సిట్యువేషన్ లో అజిత్ ఒప్పుకోరని  విడాముయార్చి ని వాయిదా వేయమంటారని మీడియాలో వినపడుతోంది. 
 

66
Richest Chief Minister in India

Richest Chief Minister in India

విడాముయార్చి రిలీజ్ అయితే మాత్రం త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయ‌న‌కే ఎక్కువ స్క్రీన్స్ ద‌క్కుతాయి. హైప్ ప‌రంగా చ‌ర‌ణ్ సినిమా కంటే అజిత్ సినిమా వెనుక‌బ‌డిన‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ తో హైప్ ను పెంచాల‌ని లైకా సంస్థ చాలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఇప్పుడు పండ‌గ రేసులోకి రామ్ చ‌ర‌ణ్(ram charan), బాల‌కృష్ణ‌(balakrishna), వెంక‌టేష్(Venkatesh) తో పాటూ అజిత్ కూడా ఉన్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రెండు రోజుల‌కు డాకు మ‌హారాజ్(Daku Maharaj), నాలుగు రోజుల‌కు సంక్రాంతికి వ‌స్తున్నాం(Sankranthiki Vasthunnam) రిలీజ‌వ‌డం కూడా ఈ సినిమాకు సానుకూల అంశ‌మే.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved