- Home
- Entertainment
- టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కావాల్సిన అజిత్.. ఆ ఒక్క తెలుగు సినిమాతో కోలీవుడ్‌లోకి షిఫ్ట్.. తెరవెనుక విషాదం
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కావాల్సిన అజిత్.. ఆ ఒక్క తెలుగు సినిమాతో కోలీవుడ్‌లోకి షిఫ్ట్.. తెరవెనుక విషాదం
కోలీవుడ్ స్టయిలీష్ స్టార్ అజిత్ కుమార్.. టాలీవుడ్‌లో సెటిల్ కావాల్సింది. కానీ తొలి తెలుగు సినిమాలో చోటు చేసుకున్న విషాదం ఆయన్ని టాలీవుడ్‌కి దూరం చేసింది.

కోలీవుడ్ స్టయిలీష్ స్టార్ అజిత్.. ఇప్పుడు తమిళంలో టాప్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. సీనియర్లు రజనీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత తరంలో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న హీరో. దళపతి విజయ్‌కి గట్టి పోటీ ఇస్తూ రాణిస్తున్నారు. ఇతర హీరోల మాదిరిగా కాకుండా తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటున్నారు. అదరగొడుతున్నారు.
కలెక్షన్ల పోటీ, ఇమేజ్, నెంబర్ గేమ్‌కి దూరంగా ఉంటారు అజిత్. కానీ కలెక్షన్ల పరంగానూ, ఇమేజ్ పరంగానూ ఆయన ఏమాత్రం తగ్గరు. కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించే హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న అజిత్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన టాలీవుడ్‌లో సెటిల్ కావాల్సిన హీరో అట. కానీ తెలుగు మూవీ కారణంగానే కోలీవుడ్ షిఫ్ట్ అయ్యాడట.
నిజానికి అజిత్ కుమార్.. హీరోగా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే. ఆయన 1993లో `ప్రేమ పుస్తకం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీకి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతి రావు కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అజిత్‌ని హీరోగా పరిచయం చేస్తుండగా, కాంచన హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ సగం వరకు జరిగింది. కానీ అంతలోనే పెద్ద విషాదం.
ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దర్శకుడు శ్రీనివాస్ మరణించారు. అజిత్ తొలి చిత్రమే ఇలా కావడంతో ఆయన షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇక గొల్లపూడి మారుతీరావు ఫ్యామిలీ సైతం విషాదంలో మునిగిపోయింది. సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. కొన్నాళ్లపాటు మూవీ జోలికి వెళ్లలేదు. ఆ తర్వాత మారుతీరావు దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాని పూర్తి చేశారు. దాదాపు రెండు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం విడుదలైంది. `ప్రేమ పుస్తకం` పెద్దగా ఆడలేదు. ఈ మూవీకి చిరంజీవి కూడా సపోర్ట్ చేశారు. దీంతో జస్ట్ ఓకే అనిపించుకుంది.
ఈ సినిమా తర్వాత కొన్నాళ్లకి అజిత్ తమిళంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. `అమరావతి` అనే మూవీలో హీరోగా నటించాడు. ఇది ముందుగా విడుదలై ఆకట్టుకుంది. దీంతో తమిళంలో ఆఫర్లు క్యూ కట్టాయి అజిత్‌కి. దీంతో తమిళంలోనే సినిమాలు కేస్తూ బిజీ అయ్యాడు. అలా కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. దీంతో `ప్రేమ పుస్తకం` అజిత్ నటించిన తొలి, ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా సమయంలో ఇలాంటి విషాదం జరగకపోయి రెగ్యూలర్‌గా రిలీజ్ అయితే అజిత్ టాలీవుడ్ హీరోగా ఉండిపోయేవారేమో.
ఇక అజిత్ ప్రస్తుతం.. అజిత్ ప్రస్తుతం తమిళంలో `విద్యా ముయార్చి` షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మగీజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ మూవీలో త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు అజిత్.. `గుబ్ బ్యాడ్ అగ్లీ` పేరుతో మరో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు అజిత్. ఈ మూవీతో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.