నేపాల్ పారిపోయి.. హోటల్ లో ఎంగిలి ప్లేట్స్ కడిగిన పుష్ప నటుడు.. కారణం ఎంటో తెలుసా..?
టాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటుడు గతంలో నేపాల్ పారిపోయి హోటల్ లో పనిచేశారట. ఇంతకీ ఎవరా నటుడు ఏంటా కథ.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా వెనుక ఏదో ఒక విషాద గాధ ఉంటుంది. మంచి స్థాయిలో ఉన్నవారు కూడా ఒకప్పుడు కష్టపడి ఇబ్బందులుపడి ఉండే అవకాశం లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి అయినా.. మరో జూనియర్ ఆర్టిస్ట్ ఆయినా.. లేద స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. ఎవరైనా సరే వెనుక ఏదో ఒక కథ మాత్రం కామన్ గా ఉంటుంది.
అలాంటి కథే ఉంది పుష్ప నటుడు అజయ్ కు కూడా. అజయ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు తనకు సబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీని ఓ సందర్భంలో వెల్లడించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడిన అజయ్.. తను నేపాల్ పారిపోయిన విషయాన్ని వెల్లడించాడు. 18 ఏళ్ల వయస్సులో రైలెక్కి తన స్నేహితుడితో పాటు నేపాల్ వెల్లాడట అజయ్.
జరనల్ బోగీలో ఎక్కి.. ప్లేస్ దొరికిన చోట కూర్చోని.. తెలిసీ తెలియని వయస్సులో ఆవేశంతో వెళ్ళాడట. అసలు నేపాల్ ఎందుకు వెళ్ళాడని అడిగితే.. మంచు కొండలు, హిమాలయాలు, నేచర్ ను చూడాలని ఫాంటసీ ఉండేదట ఈ నటుడికి. దాంతో అనుకోకుండా.. ఒక సారి అలా ట్రైన్ ఎక్కేసి ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాడట.
ఇక అక్కడే నేపాల్, భూటాన్ చుట్టు పక్కల ప్రాంతాలు తిరుగుతూ.. కుదిరిన చోట నిద్రపోతూ.. తింటూ.. చేతిలో డబ్బులు అయిపోయే దాకా తిరిగారట. ఇక రిటన్ రావడానికి డబ్బులు లేక.. బూటాన్ హోటల్స్ లో పనిచేశారట అజయ్. తన స్నేహితుడు కూడా తనతో పాటు హోటల్ లో కప్పులు, ప్లేట్ లు కడుగుతూ.. ఆ వచ్చిన డబ్బుతో రిటన్ అయ్యారట.
అజయ్ చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అజయ్ అంటే పుష్పలో అల్లు అర్జున్ ను దూరం పెడుతూ.. బాధపెట్టే అన్నగా నటించాడు. చాలా సినిమాల్లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ అందరికి పరిచయమే. ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసిన అజయ్.. విలన్ గా అందరిని మెప్పించాడు.
విక్రమార్కుడు సినిమాల్ టిట్లగా అజయ్ జీవితంలోనే మర్చిపోలేని పాత్ర చేశాడు. విక్రమార్కుడు తరువాత అజయ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ చూశాడు అజయ్. ఒక టైమ్ లో అజయ్ లేని సినిమా లేదు అంటే చూసుకోవచ్చు. ఈమధ్య అజయ్ పెద్దగా కనిపించడంలేదు.
ఆయన చేసిన పెద్ద సినిమా అంటే పుష్ప మాత్రమే. అజల్ లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక ఏమైందో ఏమో తెలియదు కాని. అజయ్ కు సినిమాలు తగ్గాయి. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు అజయ్. ఆమధ్య చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈమధ్యే మళ్లీ కనిపిస్తున్నాడు అజయ్.