తప్పతాగి బాయ్ ఫ్రెండ్ తో దొరికిన అజయ్ దేవ్ గణ్ డాటర్... వైరల్ గా వీడియో!
స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ కూతురు నైసా మరోసారి వార్తలకు ఎక్కారు. ఆమె నైట్ పార్టీలో తాగి తూలుతూ కెమెరా కంటికి చిక్కారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.

Nysa Devgan
స్టార్ కిడ్స్ పబ్ కల్చర్ వివాదాస్పదం అవుతుంది. చిన్న వయసులోనే పార్టీల పేరుతో చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. మహా నగరాల్లో పబ్ కల్చర్ ఎక్కువైపోగా వీకెండ్ వచ్చిదంటే ధనవంతుల పిల్లలు పబ్బులకు పోటెత్తుస్తున్నారు. ఇక ముంబైలోని సెలబ్స్ వారసులు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్నారు.
Nysa Devgan
అజయ్ దేవ్ గణ్ కూతురు నైసా తన బాయ్ ఫ్రెండ్ ఒర్హాన్ అవతరమణితో పాటు పబ్ ముందు తూలుతూ కనిపించారు. మీడియాను చూసి కూడా వారిలో పెద్దగా చలనం లేదు. ఒర్హాన్, నైసా తూలుతూ కారువైపు వెళ్లడం అంతా రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
Nysa Devgan
ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. పెద్దింటి పిల్లలు అయ్యుండి పేరెంట్స్ పరువు తీస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు సరిగా పెంచడం లేదని, పిల్లలను కంట్రోల్ చేయడం తెలియదా? అంటూ అజయ్ దేవ్ గణ్-కాజోల్ లపై మండిపడుతున్నారు.
Nysa Devgan
1999లో అజయ్ దేవ్ గణ్-కాజోల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా 2003లో నైసా జన్మించింది. అంటే ఆమె వయసు 20 ఏళ్ళ లోపే. అప్పుడే నైసా విపరీతంగా మందు సేవిస్తున్నారు. నిజానికి మనదేశంలో 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించకూడదు అనే నిబంధన ఉంది. కానీ పబ్ నిర్వాహకులు ఇవి పాటించకుండా యథేచ్ఛగా యువతను మత్తులో ముంచుతున్నారు.
Nysa Devgan
ఇక స్టార్ హీరోల పిల్లలు తరచుగా ఇలాంటి పార్టీల్లో దొరుకుతున్నారు. ఇటీవల షారుక్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఇలానే మందు పార్టీలో పాల్గొని మత్తులో కనిపించారు. గోల్డెన్డ్ స్పూన్ తో పుట్టిన ఈ స్టార్ కిడ్స్ జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. టీనేజ్ దాటకుండానే మత్తుకు అలవాటు పడుతున్నారు.