- Home
- Entertainment
- Aishwarya rajinkanth: వరుసగా చేదు అనుభవాలు, అయినా తగ్గని రజనీ కూతురు.. డేరింగ్ స్టెప్
Aishwarya rajinkanth: వరుసగా చేదు అనుభవాలు, అయినా తగ్గని రజనీ కూతురు.. డేరింగ్ స్టెప్
Aishwarya rajinkanth: రజనీకాంత్ కూతురు, దర్శకురాలు అయిన ఐశ్వర్య రాజనీకాంత్ తన తదుపరి సినిమా కోసం డేరింగ్ స్టేప్ తీసుకుంటుంది. ఆమె రిస్క్ చేయబోతుంది.

ఐశ్వర్య రాజనీకాంత్
Aishwarya rajinkanth: రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రాజినీకాంత్, సెల్వరాఘవన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత ధనుష్ తో '3' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పాటలు హిట్ అయినా, సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత 'వై రాజా వై' సినిమా తీశారు. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరో, ధనుష్ అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
రజనీ కూతురు ఐశ్వర్య
రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య, 'లాల్ సలాం' సినిమాతో తిరిగి వచ్చారు. ఈ సినిమాలో ఆమె తండ్రి రజనీకాంత్ అతిధి పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. సినిమా ఫ్లాప్ కి హార్డ్ డిస్క్ పోవడమే కారణం అని ఐశ్వర్య చెప్పారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రిస్క్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే డేరింగ్ స్టెప్ వేస్తుంది.
ఐశ్వర్య సినిమాలు ఫ్లాప్
సిద్ధార్థ్ హీరోగా ఐశ్వర్య సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ముందుకు సాగలేదు. ఇప్పుడు ఐశ్వర్య కొత్త సినిమా గురించి సమాచారం బయటకు వచ్చింది. కొత్త నటీనటులతో చిన్న బడ్జెట్ సినిమా తీయబోతున్నారట. దర్శకత్వం చేయడమే కాకుండా, కొత్త నిర్మాణ సంస్థ పెట్టి ఆ సినిమాను తానే నిర్మించబోతున్నారట.
నిర్మాతగా ఐశ్వర్య రాజనీకాంత్
ఐశ్వర్య నిర్మాతగా ఎందుకు మారారనే ప్రశ్నలు వస్తున్నాయి. వరుస ఫ్లాప్ ల వల్ల ఎవరూ ఆమె సినిమాలు నిర్మించడానికి ముందుకు రాలేదని, అందుకే తానే నిర్మాత అయ్యారని నెటిజన్లు అంటున్నారు. ఆమె తండ్రి, చెల్లి సౌందర్య నిర్మాతలుగా ఫ్లాప్ అయ్యారు. మరి ఐశ్వర్య నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా చూడాలి.
అదే సమయంలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆమె నిర్మాతగా డేర్ చేయడం విశేషం. తనలోనూ ప్యాషన్ ని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తన తపనకిది అద్దం పడుతుంది. మరి ఈ సారైనా సక్సెస్ అవుతుందా? అనేది చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఆమెకి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 18ఏళ్ల తర్వాత వీరి విడాకులు తీసుకున్నారు.
read more: Dhanush: సినిమాకి తానే దర్శకుడు, కానీ ఆడియో ఈవెంట్‌కి బంక్ కొట్టిన ధనుష్, ఏం జరిగింది?
also read: Vijay: విజయ్ పండగ శుభాకాంక్షలు: నెటిజన్ల ట్రోలింగ్.. కారణం ఏంటంటే?