అంతా ధనుష్ చేశాడు, నాదేం లేదు.. ఐశ్వర్య రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా తన మాజీ భర్త ..తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య 2004లో స్టార్ హీరో ధనుష్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర మరియు లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 18 ఏళ్ల పాటు లైఫ్ ను హ్యాపీగా గడిపిన ఈ జంట .. మనస్పర్థల కారణంగా 2022లో హఠాత్తుగా విడిపోయారు.
ఇద్దరూ కలిసి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ధనుష్-ఐశ్వర్య జంటగా తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.తర్వాత కుటుంబసభ్యులు మాట్లాడి ఒప్పించడంతో విడాకుల నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.
Aishwarya Rajinikanth
ధనుష్‌తో విడిపోయిన తర్వాత, దర్శకురాలిగా మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.
లాల్ సలామ్ పరాజయం తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో ఆమె వివిధ విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి కూడా ఆమె మాట్లాడింది.
aishwarya rajinikanth
ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 సినిమాలతో అనిరుధ్ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే అతడిని పరిచయం చేయడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
dhanush anirudh
ఈ విషయంలో పూర్తిగా ధనుష్‌దే బాధ్యత అని కూడా ఆమె చెప్పారు. అనిరుధ్‌ను చదివించేందుకు తల్లిదండ్రులు విదేశాలకు పంపాలని చూశారట. కానీ అతని ప్రతిభను గుర్తించిన ధనుష్... తన సొంత ఖర్చుతో కీబోర్డ్ కొనడమే కాకుండా ఐశ్వర్యతో మాట్లాడి 3 సినిమాల్లో మ్యూజిక్ కంపోజర్ గా పరిచయం చేసాడు.
అనిరుధ్ సినిమాల్లోకి రావడానికి ధనుష్ కారణమని, ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అతని ప్రతిభే కారణమని అన్నారు ఐశ్వర్య. తన ఎదుగుదల ఆనందంగా ఉందని ఐశ్వర్య ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ధనుష్ గురించి ఐశ్వర్య పాజిటీవ్ గా మాట్లాడటంతో.. ధనుష్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. వీళ్లిద్దరు మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు.