- Home
- Entertainment
- అతిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్.. ఐశ్వర్య రాయ్ పై షాకింగ్ ట్రోల్స్..
అతిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్.. ఐశ్వర్య రాయ్ పై షాకింగ్ ట్రోల్స్..
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అనేక ప్రశంసలు అందుకోవడంతోపాటు పలు విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఆమె అందంపై దారుణంగా ట్రోల్స్ చక్కర్లు కొడుతుండటంతో సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది.

సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సినిమా వాళ్ల లైఫ్‌కి సంబంధించి, వాళ్లు ధరించే దుస్తులు బాగా ట్రోల్స్ కి గురవుతున్నాయి. వాళ్లు చేసే పనిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎంత మంచి చేసినా, అందులోని తప్పులను వెతుకుతూ కామెంట్లు చేస్తుంటారు. హీరోయిన్లు చాలా వరకు ట్రోల్స్ బారిన పడ్డ సందర్భాల్లుంటాయి. విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) కూడా ఇలాంటి ట్రోల్స్ కి గురి కావడం గమనార్హం.
ప్రపంచ సుందరిగా నిలిచి తన అందంతో ఫిదా చేసింది ఐశ్వర్య రాయ్. ఆమె అందాన్ని పొగడని, ఆమె అందానికి ముగ్దులు కాని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. చూపుతిప్పుకోలేని అందం ఆమె సొంతం. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే అలాంటి ఐశ్వర్య రాయ్ కూడా కాన్స్(Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శలెదుర్కొంది. దాదాపు 20ఏళ్లుగా ఆమె కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇండియా నుంచి అత్యధికసార్లు ప్రతినిధ్యం వహిస్తున్న నటిగా ఐశ్వర్య రికార్డ్ సృష్టించారు.
అయితే అంతకు ముందు పలు మార్లు ఆమె కాన్స్ లో ధరించిన దుస్తులు, లిప్ స్టిక్స్ వివాదానికి కారణమయ్యాయి. ఆమె ధరించిన డ్రెస్‌కి, పూసుకున్న లిప్ స్టిక్‌కి ఏమైనా సంబంధం ఉందా? అని, మరోవైపు ఎక్కువగా లిప్ స్టిక్ ధరించడంపై విమర్శలొచ్చాయి. దీంతోపాటు కొన్ని సార్లు ఆమె రెడ్ కార్పెట్‌పై వాక్ చేసేందుకు ధరించిన డ్రెస్ కూడా విమర్శలెదుర్కొంది. Aishwarya Rai Trolls.
ఇప్పుడు ఊహించని విధంగా ట్రోల్స్ కి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఐశ్వర్య అందాన్ని టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఆమె రెండు రోజుల క్రితం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2022) లో రెడ్ కార్పెట్‌పై వాక్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో పూలబొకే ధరించినట్టుగా ఉన్న ట్రెండీ వేర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఆమె అందాన్ని కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడటం విశేషం.
ఇంత వరకు బాగానే ఉన్నా ఆమె కాస్త లావుగా కనిపించడం ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో ఐష్ కాస్త లావుగా కనిపిస్తుంది. బ్లాక్ డ్రెస్‌లో ఐష్ చాలా హాట్‌గా ఉందని, కానీ బాగా లావెక్కినట్టుందంటున్నారు నెటిజన్లు. ముసలివైపోయావు, నీకింక తల్లి పాత్రలే వస్తాయి అని, మరీ అతిగా సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్ అని, బహుశా గర్భం దాల్చడం వల్లే ఇలా బొద్దుగా కనిపిస్తుందని, వయసు మీద పడటం వల్లే ఇలా కనిపిస్తుందంటూ రెచ్చిపోతున్నారు. ఐష్‌ని ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు.
1994లో మిస్ వరల్డ్ గా నిలిచిన ఐశ్వర్య రాయ్, `ఇరువుర్`(ఇద్దరు) చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి 2007లో మ్యారేజ్ చేసుకుని, 2011లో కూతురు ఆరాధ్యకి జన్మనిచ్చే క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుంది. రీఎంట్రీ తర్వాత ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. దీంతో సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె `పొన్నియిన్ సెల్వన్` చిత్రంలో మందాకిని దేవిగా నటిస్తుంది.
ఇదిలా ఉంటే 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ సందడి చేసింది. రెండో రోజు రెడ్ కార్పెట్‌పై వాక్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు తన కూతురు, అభిషేక్ బచ్చన్‌తో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం తిరిగి ముంబయి చేరుకున్నారు.