MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల పోస్ట్ కి లైక్‌ కొట్టి దొరికిపోయిన అభిషేక్‌ బచ్చన్‌.. ఐశ్వర్యా రాయ్‌తో ముడిపెడుతూ రచ్చ..

విడాకుల పోస్ట్ కి లైక్‌ కొట్టి దొరికిపోయిన అభిషేక్‌ బచ్చన్‌.. ఐశ్వర్యా రాయ్‌తో ముడిపెడుతూ రచ్చ..

అసలే భర్తతో ఐశ్వర్య రాయ్‌ విడిపోతున్నారని అంతా కోడై కూస్తున్నారు. ఈ క్రమంలో అభిషేక్‌ బచ్చన్ చేసిన పని ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. మొత్తం రచ్చ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 22 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడిపోతున్నారనే వార్తలు చాలా కాలంగా బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. హిందీ మీడియా ఈ విషయాన్ని తరచూ హైలైట్‌ చేస్తుంది. ఇటీవల అంబానీ పెళ్లిలోనూ వీళ్ల మధ్య గ్యాప్‌ ఉందని తేలిపోయింది. అమితా్‌ బచ్చన్‌ ఫ్యామిలీ, అభిషేక్‌ బచ్చన్‌ ముందుగా వస్తే, చాలా సేపటి తర్వాత ఐశ్వర్యా రాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. విడి విడిగానే ఫోటోలు దిగారు. దీంతో ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారనే విషయం స్పష్టమయ్యిందంటూ నెటిజన్లు కోడైకూశారు. ఈ ఇద్దరు విడిపోవడం పక్కా అనే నిర్ణయానికి వచ్చారు. 
 

25

ఇప్పుడు అభిషేక్‌ బచ్చన్‌ చేసిన పని మరింత పెద్ద రచ్చ అవుతుంది. మరోసారి విడాకుల వార్త వైరల్ గా మారింది. అయితే అభిషేక్‌ బచ్చన్‌ విడాకుల పోస్ట్ కే లైక్ కొట్టడం ఈ రచ్చకి కారణమవుతుందని చెప్పొచ్చు. మరి ఆ సంగతేంటో చూస్తే.. ప్రముఖ రచయిత్రి హీనా కండేల్ వాల్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో పెళ్లై చాలా ఏళ్లు అయిన జంట విడిపోవాలని నిర్ణయంచుకునే `గ్రే డైవర్సెస్‌`కి కారణాలను మ్యాప్‌ ద్వారా వివరించింది. ఓ మేగజీన్‌కి ఆర్టికల్‌ రాసింది. ఇందులో విడాకుల ట్రెండ్‌ పెరుగుతున్న విధానాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ప్రేమ కష్టంగా మారినప్పుడు జంటలు ఎదుర్కొనే సంక్లిష్టమైన సవాళ్లని, ప్రశ్నలను సంధించారు. 
 

35

ఈ పోస్ట్ అభిషేక్‌ బచ్చన్‌కి బాగా నచ్చినట్టుంది. ఆయన దానికి లైక్‌ కొట్టాడు. అదే ఇప్పుడు దుమారం రేపుతుంది. అభిషేక్‌ కొట్టిన లైక్‌ ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారనే పుకార్లు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అభిషేక్‌ చేసిన పని దానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఐష్‌తో విడిపోతున్నారనేదానికి ఇదే సిగ్నల్‌ అని అంటున్నారు. దీంతో బాలీవుడ్‌ మీడియా సైతం దీన్ని హైలైట్‌ చేస్తుంది. ఈ ఇద్దరు విడిపోవడం ఖాయమనే పరిస్థితిలోకి వచ్చారు.

45

అయితే దీని వెనుక కథేంటో బయటకు వచ్చింది. ఆ రైటర్‌ ఎవరో కాదు, ఐశ్వర్యా రాయ్‌ స్నేహితురాలు. ఆమె పెట్టిన పోస్ట్ ని అభిషేక్‌ లైక్‌ కొట్టాడంటే, ఆమె తనకు తెలుసు. ఆమెని సపోర్ట్ చేసే క్రమంలో ఆయన ఈ లైక్‌ కొట్టి ఉంటాడని అంటున్నారు. అభిషేక్‌ లైక్ వెనుక కథ ఇదే అని అంటున్నారు. కానీ ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి. అదే సమయంలో నిజంగానే అభిషేక్‌, ఐశ్వర్యా విడిపోతున్నారా? లేక ఇవి కేవలం రూమర్లేనా? అనేది కూడా తెలియాల్సి ఉంది. 
 

55

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌.. అభిషేక్‌ బచ్చన్‌ కలిసి `థాయ్‌ అక్షర్ ప్రేమ్‌ కే`, `ఉమ్రాన్‌ జాన్‌` చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కొన్నేళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2007 ఏప్రిల్‌ 20న మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కూతురు ఆరాధ్య ఉన్నారు. ఆమె చాలా పెద్దదైపోయింది. హీరోయిన్‌ మెటీరియల్గా కనిపిస్తుంది. మరి ఐష్‌ కూతురిని సినిమాల్లోకి తీసుకొస్తుందా అనేది చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kritika Kamra Wedding: స్పోర్ట్స్ యాంకర్ తో హీరోయిన్ పెళ్లి.. హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న జంట
Recommended image2
Director Maruthi: రాజాసాబ్ తర్వాత కొత్త కథ రెడీ చేసిన మారుతి ? లిస్ట్ లో ఆ ఇద్దరు హీరోలు
Recommended image3
Bigg Boss Telugu 9 విన్నర్‌ని చేయనందుకు ఇమ్మాన్యుయెల్‌ బరస్ట్.. ఓటింగ్‌ కోసం అమ్మనాన్న ఊర్లన్నీ తిరిగారంటూ కన్నీళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved