ఐశ్యర్య-అభిషేక్ విడాకుల పుకార్ల మధ్య, షాకింగ్ ఫోటోలు వైరల్!
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల విడాకులపై గత 5 నెలలుగా మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలింది. ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ జంట కలిసి కనిపించారు.
ఐశ్వర్య, అభిషేక్ కలిసి కనిపించారు
విడాకుల పుకార్ల మధ్య ఐశ్వర్య, అభిషేక్ కలిసి కనిపించారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కపుల్ విడాకుల పుకార్లకు చెక్ పెట్టారు.
వివాహ సంబరంలో ఐశ్వర్య, అభిషేక్
ఈ ఫోటోలు డిసెంబర్ 5న జరిగిన ఓ వివాహ వేడుకలో తీసినవి. సదరు ఫోటోల్లో ఈ జంట సంతోషంగా కనిపిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు అన్నట్లు వారి తీరు ఉంది. ఈ మధ్య కాలంలో ఐశ్యర్య, అభిషేక్ ఇలా కలిసి కనిపించింది లేదు.
నలుపు దుస్తుల్లో ఐశ్వర్య, అభిషేక్
ఈ ఫోటోల్లో అభిషేక్ నలుపు సూట్, ఐశ్వర్య నలుపు రంగు డిజైనర్ వేర్ ధరించారు. కలర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. వీరి మధ్య అవగాహన కుదిరింది. విడాకుల వార్తల్లో నిజం లేదన్న మరో వాదన తెరపైకి వచ్చింది.
సెల్ఫీ దిగుతున్న ఐశ్వర్య, అభిషేక్
ఐశ్వర్య, అభిషేక్ కలిసి ఫోజులివ్వడమే కాకుండా సెల్ఫీ కూడా దిగారు. నటి ఐషా జుల్కా కూడా వారితో ఉన్నారు ఓ ఫోటోలో అభిషేక్... ఐశ్వర్య తల్లి వృందా రాయ్ తో కలిసి ఫోజులిచ్చారు.
వృందా రాయ్ తో ఐశ్వర్య, అభిషేక్
ఈ ఏడాది జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. అప్పటి నుంచి వీరి విడాకుల పుకార్లకు పునాది పడింది. లేటెస్ట్ ఫోటోల నేపథ్యంలో విడాకుల ఊహానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన ఫోటో
2007లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఐశ్వర్య నటుడు వివేక్ ఒబెరాయ్ ని ఘాడంగా ప్రేమించింది. అతడితో బ్రేకప్ అయ్యాక సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడ్డారు. సల్మాన్-ఐశ్వర్య మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు.