Niharika: ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది... పొట్టి గౌను వేసుకున్న నిహారిక హాట్ ఫోటోపై నెటిజెన్స్ సెటైర్స్
మెగా ఫ్యామిలీ లో డేరింగ్ డాషింగ్ గర్ల్ గా ఉంది నిహారిక. ఆ కుటుంబం నుండి హీరోయిన్స్ రాకూడదనే నియమాన్ని బద్దలు కొట్టిన బ్యూటీ. పలు విమర్శలకు ఎదిరించి తన కోరిక నెరవేర్చుకుంది. మరి హీరోయిన్ అంటే ఫోటో షూట్స్, గ్లామర్ షోస్ కామన్. నిహారిక అదే చేశారు, చేస్తున్నారు.
Niharika konidela
తాజాగా నిహారిక (Niharika Konidela)తన విదేశీ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారు. జోర్డాన్ దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఆమె షార్ట్ ఫ్రాక్ లో కనిపించారు. గాగుల్స్ పెట్టుకొని సూపర్ హాట్ అండ్ స్టైలిష్ గా ఉన్న నిహారిక ఫోటోపై పలువురు సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి, సుస్మిత కొణిదెల బ్యూటిఫుల్, వావ్ వాట్ ఆ షాట్ అంటూ కామెంట్స్ పెట్టారు.
Niharika konidela
కొందరు నెటిజెన్స్ మాత్రం ఆమెపై దాడికి దిగారు. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది, అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. తరచుగా సోషల్ మీడియా ట్రోల్స్ కి గురవుతున్నారు. ఆమె పబ్ లో పట్టుబడడం మెగా ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. నిహారిక మెగా కుటుంబం పరువు తీస్తుందని మండిపడుతున్నారు.
ఇక ఈ విమర్శలు, ఆరోపణలు పట్టించుకోని నిహారిక... మై లైఫ్, మై రూల్స్ అంటూ ముందుకు సాగిపోతున్నారు. వెకేషన్ లో భర్త వెంకట చైతన్యకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో షేర్ చేయగా కొంచెం వివాదాస్పదం అయ్యింది. ఈ వివాదాల్లో కుటుంబం నిహారికకు అండగా నిలవడం విశేషం. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో పట్టుబడిన నిహారిక తప్పేమీ లేదని నాగబాబు వీడియో బైట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తల్లి పద్మజ ఆమెకు పూర్తి మద్దతు తెలిపింది. నిహారిక ఏమిటో మాకు తెలుసు ఆమెపై వచ్చే నిరాధారమైన ఆరోపణలు పట్టించుకోమని అన్నారు. అలాగే మాకు ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి బావగారు(చిరంజీవి) ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
కాగా వివాహం తర్వాత నిహారిక నటనకు గుడ్ బై చెప్తారనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె పలు చిత్రాలు, సిరీస్లలో నటిస్తున్నారు. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రపంచంలో పుట్టి పెరిగిన అమ్మాయిగా.. అక్కడే కెరీర్ వెతుక్కుంటున్నారు.