- Home
- Entertainment
- Jabardasth: జబర్దస్త్ కి కష్టకాలం.. నిన్న రోజా నేడు హైపర్ ఆది రేపు..? ఒక్కొక్కరిగా వీడుతున్న స్టార్స్!
Jabardasth: జబర్దస్త్ కి కష్టకాలం.. నిన్న రోజా నేడు హైపర్ ఆది రేపు..? ఒక్కొక్కరిగా వీడుతున్న స్టార్స్!
దిగ్గజ కామెడీ షో జబర్దస్త్ కి కష్టకాలం మొదలైంది. ఒక్కొక్కరుగా షోని వీడుతుండగా పూర్వవైభవం కోల్పోతుంది. ఇకపై టాప్ రేటింగ్ సాధించడం కష్టమేనన్న మాట వినిపిస్తుంది.

Jabardasth comedy show
దశాబ్దకాలం ఓ షో అగ్రగామిగా కొనసాగడం అరుదైన విషయం. ఈటీవీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన కామెడీ షో జబర్దస్త్ (Jabardasth Comdedy Show)సూపర్ సక్సెస్ సాధించింది. ఏళ్లు తరబడి టాప్ రేటెడ్ షోగా కొనసాగింది. క్లాస్ మాస్, పేద ధనిక, చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా జబర్దస్త్ ఆకట్టుకుంది. యూట్యూబ్ లో జబర్దస్త్ చూసే ప్రేక్షకుల సంఖ్య కోట్లకు చేరింది.
Jabardasth comedy show
జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రారంభించారు. అనసూయ(Anasuya) జబర్దస్త్ కి ,రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్స్ గా మారారు. ఎక్కడలేని ఫేమ్ రాబట్టి బుల్లితెర స్టార్స్ గా అవతరించారు. నటుడు నాగబాబు, రోజా జడ్జెస్ అవతారం ఎత్తారు. వారిద్దరికీ ఈ కామెడీ షో గొప్ప ఆదాయమార్గంగా మారింది.
Jabardasth comedy show
అసలు పోటీ అంటూ ఎరుగని జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లీడర్స్ గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్స్ పంచింది. జబర్దస్త్ షో కారణంగా ఫేమ్ రాబట్టిన కొందరు కమెడియన్స్ కి సినిమా అవకాశాలు రావడంతో అటువైపు వెళ్లారు. అయితే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, హైపర్ ఆది, చలాకీ చంటి టీమ్స్ జబర్దస్త్ కి ఆయువుగా మారాయి. ముఖ్యంగా జబర్దస్త్ లో ఆది టీం, ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం మంచి కామెడీ పంచుతూ... చాలా మంది టీమ్ లీడర్స్ తప్పుకున్నా షోకి ఆదరణ తగ్గకుండా చేశారు.
Jabardasth comedy show
ఇక జబర్దస్త్ మేకర్స్ తో గొడవపడి నాగబాబు(Nagababu) 2019లో షోని వీడారు. ఆయన పోతూ పోతూ జబర్దస్త్ మేనేజర్స్ తో పాటు చమ్మక్ చంద్ర, ఆర్పీ వంటి కమెడియన్స్ ని పట్టుకుపోయాడు. నాగబాబు నిష్క్రమణ కూడా జబర్దస్త్ ని నష్ట పరచలేదు. జడ్జిగా రోజా కొనసాగగా, నాగబాబు స్థానంలో సింగర్ మనో వచ్చారు. రోజా, మనో కాంబినేషన్ కూడా సక్సెస్ అని చెప్పాలి.
Jabardasth comedy show
కాగా ఇటీవల ఎమ్మెల్యే నుండి మంత్రిగా ప్రమోషన్ పొందిన రోజా (RK Roja)జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. ఇది షోకి పెద్ద కుదుపని చెప్పాలి. జబర్దస్త్ జడ్జిగా 9 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఆమె మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నారు. సెన్సాప్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్ పంచెస్ ఆమెను బెస్ట్ జడ్జిగా మార్చాయి. ఇకపై రోజా జబర్దస్త్ షోలో కనిపించరు.
Jabardasth comedy show
అలాగే జబర్దస్త్ కి ఆయువు పట్టుగా ఉన్న హైపర్ ఆది (Hyper aadi) కూడా బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. సినిమా ఆఫర్స్ కారణంగానో, కొత్త షోలో అవకాశం రావడం వలనో ఆయన జబర్దస్త్ కి దూరమయ్యాడనేది విశ్వసనీయ సమాచారం. హైపర్ ఆది కూడా ఇకపై జబర్దస్త్ లో కనిపించరట. హైపర్ ఆది లేకపోతే ప్రేక్షకులకు షో పట్ల మరింత ఆసక్తి తగ్గుతుందనడంలో సందేహం లేదు.
Jabardasth comedy show
మరోవైపు సుడిగాలి సుధీర్ టీమ్ పెర్ఫార్మన్స్ కూడా అంతంత మాత్రమే. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు స్కిట్స్ పై ఏమంత శ్రద్ధ పెట్టడం లేదు. ఓ వారం ఒకరుంటే మరొక వారం మరొకరు ఉండటం లేదు. చాలా కాలంగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఈ ముగ్గురు ఉన్నారు.
షో యాజమాన్యాల నిర్మాతల ఒత్తిళ్లు, అగ్రిమెంట్స్ కి భయపడి కొనసాగుతున్నారన్న పుకార్లు ఉన్నాయి.మొత్తంగా జబర్దస్త్ రెండు షోలు పూర్వ వైభవం కోల్పోతున్నాయి. స్టార్స్ గా ఉన్నవారందరూ షోని వీడడం మైనస్ గా మారింది.