5 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సర్ప్రైజ్, పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా..?
తాజాగా అల్లుఅర్జున్ అందరికి షాక్ ఇచ్చాడు.. ఫ్యాన్స్ కు కాస్త కిక్ ఇచ్చాడు.. ఓవర్ ఆల్ గా పుష్ప 3 సినిమాపై కాస్త క్లారిటీకూడా ఇచ్చాడు అది కూడా ఏం మాట్లాడకుండానే.
Allu Arjun
గత కొద్ది రోజులుగా అల్లుఅర్జన్ విషయంలో ఏం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. పుష్ప2 రిలీజ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట,కోర్టు లు కేసులు, ప్రభుత్వం సీరియస్ అవ్వడం, ఇలా రకరకాల పరిణామాలు చూశాం. అంతే కాదు ఈమధ్యలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప2 సినిమా సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లుఅర్జున్. ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. అంతలా అల్లు అర్జున్ ను ట్రోల్ చేశారు.
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అన్నట్టుగా ఓ ముద్ర పడిపోయింది. దాంతో అల్లు అర్జున్ కూడా చాలా బాధపడ్డారు. అయితే ఈ చికాకుల వల్ల పుష్ప అన్నా.. పుష్ప గెటప్ లో అల్లు అర్జున్ ను చూసినా కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యారు ఫ్యాన్. అన్న ఎప్పుడు రీ ఫ్రెష్అవుతాడు అని ఎదురు చూశారు. అల్లు అర్జున్ కూడా పుష్ప సీక్వెల్స్ కోసం దాదాపు 5 ఏళ్ళు టైమ్ అలా ఇచ్చేశాడు.
photo credit-aha unstoppable4 promo
ఈ ఐదేళ్ళు వేరే సినిమా వైపు చూడలేదు అల్లు అర్జున్. ఇక ఈ ఐదేళ్లు పుష్ప గెటప్ లోనే ఉన్నాడు. ఈ లుక్ లో అల్లు అర్జున్ ను చూసి ఫ్యాన్స్ కు బోర్ కొట్టేసింది. ఒక రకంగా చిరాకు వచ్చేసింది. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ ఇబ్బందులు, తన లుక్ మీద తనకే ఏం అనిపించిందో ఏమో తెలియదు కాని..బన్నీ కంప్లీట్ గా తన గెటప్ ను మార్చేశాడు.
లాంగ్ హెయిర్, గెడ్డంతో ఉండే బన్నీ.. తాజాగా చిన్నగ హెయిర్ కట్ చేయించుకుని..స్టైలీష్ గా గెడ్డం చేయించుకున్నారు. రీసెంట్ గా బన్నీకి రెగ్యులర్ బెయిల్ రావడంతో.. దాని కోసం కోర్డ్ కు వెళ్ళిన అల్లు అర్జున్ ఈ గెటప్ లో కనిపించారు. దాంతో ఫ్యాన్స్ తమఅభిమాన హీరోను ఇలా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
Allu Arjun, , Pushpa,
అయితే ఇక్కడ మరో సందేహం ఏంటంటే.. పుష్ప3 ని అనౌన్స్ చేశారు కదా.. మరి బన్నీ పుష్ప గెటప్ నుంచి బయటకు వచ్చాడంటే.. ఈసినిమా ఇప్పట్లో లేనట్టేనా అని అంతా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చికాకులుజరిగి ఉండకపోయింటే.. పుష్ప3 త్వరలోనే స్టార్ట్ అయ్యేదేమో. కాని ఇంత రచ్చ జరగడంతో.. సుకుమార్ కూడా ఓ సందర్భంలో.. నేను మర్చిపోలేకపోతున్నాను.. ఒక ప్రాణం తీసుకురాలేము కదా అని బాగా బాధపడ్డాడు.
Rajamouli
దాంతో పుష్3 కి లాంగ్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్ట తెలుస్తోంది. మరో రెండు సినిమాలు చేసిన తరువాత బన్నీ..ఇదంతా ఆడియన్స్ మర్చిపోయిన తరువాతే పుష్ప3 లోకి వెళ్తాడనిసమాచారం.ఇక అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్, సందీప్ రెడ్డి, కొరటాల లాంటివారురెడీగా ఉన్నారు. నెక్ట్స్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా పట్టాలక్కనున్నట్టు సమాచారం. దాదాపు 500 కోట్లతో ఈమూవీ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మరి బన్నీ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.