MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • `జయం`తర్వాత సదాకి ఆఫర్లు రాకుండా చేశారా? .. ఆ మూవీ సక్సెస్ అని కూడా చెప్పలేదా? తెరవెనుక కథ బయటపెట్టిన హీరోయిన్

`జయం`తర్వాత సదాకి ఆఫర్లు రాకుండా చేశారా? .. ఆ మూవీ సక్సెస్ అని కూడా చెప్పలేదా? తెరవెనుక కథ బయటపెట్టిన హీరోయిన్

`జయం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని మాయ చేసిన సదా.. ఆ సినిమా తర్వాత తనకు జరిగిన అన్యాయంపై స్పందించింది. ఆఫర్లు రాకుండా చేశారని షాకిచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 13 2024, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sadaa

Sadaa

సదా.. `జయం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకుని స్టార్‌ అయిపోయింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది. పల్లెటూరి అమ్మాయి లెహంగా ఓణిలో ఆమె ఆడియెన్స్ ని మాయ చేసేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ ప్రారంభంలో ఆ స్థాయి హిట్‌ పడలేదు. కొంత గ్యాప్‌తో మళ్లీ సక్సెస్‌ ఫుల్‌ ఫిల్మ్స్ తో పుంజుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే సదాకి `జయం` సక్సెస్‌ తర్వాత ఆఫర్లు రాలేదట. ఆమె మళ్లీ స్టడీస్‌ వైపు వెళ్లిందట. ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు సినిమాలు చేయలేదనే దానికి క్లారిటీ ఇచ్చింది సదా. ఈ క్రమంలో ఆమె పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తనది సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ కాదు. ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్న సమయంలో తేజ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. `జయం`లో ఆఫర్‌ రావడం పెద్ద లక్కీగా భావిస్తున్నాం. అయితే `జయం` సినిమా హిట్‌ అని కూడా తనకు తెలియదట. ఆ సినిమా హిట్‌ అయ్యిందని కూడా తనకు ఎవరూ చెప్పలేదని తెలిపింది సదా. 
 

36
Sadaa

Sadaa

తన నెంబర్‌ అయితే అందరి వద్ద ఉంది. కానీ పీఆర్‌ మెయింటేన్‌ చేయలేదు. అలా చేయాలని కూడా తెలియదు. అవకాశాలు రావడానికి సంబంధించి ఎవరిని అప్రోచ్‌ కావాలో కూడా తెలియదు. దీంతో నేను మళ్లీ స్టడీస్‌ వైపు వెళ్లిపోయా. ఆ సమయంలో ఐటీ రిలేటెడ్‌ స్టడీస్‌ చేస్తున్నా. మళ్లీ స్టడీస్‌ చేస్తున్నాను. నన్ను ఎవరూ సినిమా కోసం సంప్రదించలేదు. ఆ తర్వాత కలిసినప్పుడు మీ కోసం అడిగామని, మీ కాంటాక్ట్ దొరకలేదని చాలా మంది నిర్మాతలు చెప్పారు. అంటే నాకు ఆఫర్లు వచ్చాయి, కానీ నా వరకు రాలేద`ని చెప్పింది సదా. 

46

ఈ క్రమంలో మధ్యలోనే కొందరు ఆమెకి ఆఫర్లు రాకుండా చేశారని అర్థమవుతుంది. కొంత గ్యాప్‌తో సదా మళ్లీ సినిమాలు చేసింది. `ప్రాణం`, `నాగ`, `దొంగా దొంగది`, `లీలా మహల్‌ సెంటర్‌`, `ఔనన్నా కాదన్నా`, `అపరిచితుడు`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `టక్కరి`, `మైత్రీ` వంటి సినిమాల్లో మెరిసింది సదా. కానీ ఆమె తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం, తగిన గుర్తింపు రాకపోవడానికి సంబంధించిన తనకు కూడా అర్థం కాలేదని చెప్పింది సదా. ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలా మంది తనకు ఆఫర్‌ చేశామని అన్నారు, కానీ నా వరకు రాకపోవడమే వింతగా అనిపించింది. 
 

56

రీఎంట్రీ సమయంలోనూ చాలా మంది నిర్మాతల నుంచి ఇలాంటి సమాధానమే వచ్చిందని చెప్పింది సదా. అంటే మొత్తంగా సదా వరకు వెళ్లకుండా మధ్యలోనే కొందరు కుట్ర చేశారని అర్థమవుతుంది. సదాకి తెలియకుండా ఆమె వెనుక ఏదో కుట్ర జరిగిందని తెలుస్తుంది. దానికి కారణం సినిమా బ్యాక్‌ గ్రాండ్‌ కాకపోవడం, సరైన పీఆర్‌ సిస్టమ్‌ బిల్డ్ చేసుకోకపోవడమే అని తెలుస్తుందని చెప్పింది. నాకు తెలిసిన వారిమీదనే నేను డిపెండ్‌ అయ్యానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పింది సదా. 
 

66

ప్రస్తుతం సదా రీఎంట్రీ తర్వాత సెలక్టీవ్‌గా సినిమాలు చేయడంతోపాటు టీవీ షోస్‌తో ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఆమె ఇటీవల `అహింస` అనే సినిమాలో నటించింది. దీంతోపాటు `ఆది కేశవ` మూవీలోనూ మెరిసింది. దీంతోపాటు `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు `నీతోనే డాన్స్` షోకి జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది సదా. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలతో మరింతగా మెప్పిస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved