తమన్నాతో ఎఫైర్ అందుకే రహస్యంగా ఉంచాను... విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్!
తమన్నా-విజయ్ వర్మ ప్రేమలో పడ్డారని మీడియా కోడైకూసింది. ఎక్కడ చూసినా వీరు జంటగా కనిపించడంతో పాటు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫైనల్ గా వీరిద్దరూ ఓపెన్ అయ్యారు.

తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి వారి ప్రవర్తన కారణమైంది. అయితే తమన్నా, విజయ్ వర్మ బుకాయిస్తూ వచ్చారు. ముఖ్యంగా తమన్నా నేను సింగిల్, నేను ఎవరినీ ప్రేమించడం లేదంటూ ఆమె అబద్దం చెప్పారు. ఫైనల్లీ ఇద్దరూ ఓపెన్ అయ్యారు.
అవును విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమే అని కుండబద్దలు కొట్టింది తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మంది హీరోలతో పని చేశాను. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ వచ్చాడు. అతనున్న ప్రదేశమే నాకు ఇష్టమైన ప్రదేశం, అని తమన్నా అన్నారు.
తాజాగా విజయ్ వర్మ సైతం ఒప్పుకున్నాడు. అలాగే తమ బంధాన్ని ఎందుకు రహస్యంగా ఉండాల్సి వచ్చిందో చెప్పాడు. ఆయన మాట్లాడుతూ... నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ కి నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పాలి అనుకున్నాను. పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేయాలి, అనుకున్నాను. అందుకే తమన్నాతో ప్రేమ విషయం బయట పెట్టలేదన్నారు.
దీంతో విజయ్ వర్మ-తమన్నా బంధంపై ముసుగు తొలిగిపోయింది. వారు డేటింగ్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 జూన్ 29 నుండి స్ట్రీమ్ కానుంది. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్లో విజయ్ వర్మ సైతం భాగం కాగా తమన్నాతో ఆయనకు బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల కెరీర్లో అనేక మంది హీరోలతో పని చేసిన తమన్నా విజయ్ వర్మకు ఫ్లాట్ కావడం ఊహించని పరిణామం.
ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్, తమిళంలో జైలర్ మూవీ చేస్తున్నారు. ఇవి రెండూ దసరా ఇండిపెండెన్స్ డే కానుకగా ఒక రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. భోళా శంకర్, జైలర్ చిత్రాలతో చిరంజీవి, రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు.