అక్కినేని ఫ్యామిలిలో అడివి శేష్ భాగమా, ఆమెతో రిలేషన్ కంఫర్మ్ అయినట్లేగా ? .. వైరల్ ఫోటో
ప్రస్తుతం యువ హీరో అడివి శేష్ పట్టిందల్లా బంగారం అవుతోంది. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం యువ హీరో అడివి శేష్ పట్టిందల్లా బంగారం అవుతోంది. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ప్రాంఛైజీలా హిట్ సిరీస్ కొనసాగనుంది. హిట్ 2 ఘనవిజయం సాధించడంతో హిట్ 3పై ఇప్పటి నుంచే బజ్ మొదలైంది.
అడివి శేష్ ఎంచుకున్న కథలు, అతడుచేస్తున్న చిత్రాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ తో అడివి శేష్ అద్భుతమైన చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాది శేష్ మేజర్, హిట్ 2 తో విజయం అందుకున్నాడు. ఇదిలా ఉండగా అడివి శేష్ తన మ్యారేజ్ గురించి ఇంకా ఓపెన్ కావడం లేదు. పెళ్లి ఎప్పుడు అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తున్నాడు.
అయితే తాజాగా అడివి శేష్ అక్కినేని కుటుంబ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొనడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అక్కినేని ఫ్యామిలీ నేటి తరం నటులు.. అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ మరికొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరి మధ్యలో అడివి శేష్ కూడా అక్కినేని ఫ్యామిలిలో కలిసిపోయాడు.
అడివి శేష్ తన ప్రేమ పెళ్లి గురించి ఓపెన్ కానప్పటికీ అతడి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అడివి శేష్ ఒక లేడీ ప్రొడ్యూసర్ తో రిలేషన్ లో ఉన్నదంటూ ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఇప్పుడు అడివి శేష్ అక్కినేని ఫ్యామిలీ వేడుకలో సుప్రియ పక్కన ఉండడం ఆసక్తికరంగా మారింది.
అఖిల్ ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్కినేని కజిన్స్ అని కామెంట్ కూడా పెట్టాడు. అడివి శేష్ అక్కినేని కజిన్ ఎలా అవుతాడు అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ ఏదో ఒక రిలేషన్ ఉన్నప్పుడే కజిన్ అవుతాడు.
దీనితో అడివి శేష్, సుప్రియ రిలేషన్ గురించి కొత్త చర్చ షురూ అయింది. సుప్రియ అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ సరసన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంలో నటించింది. ఆ తర్వాత అడివి శేష్ గూఢచారిలో కీలక పాత్రలో మెరిసింది. ఈ చిత్రానికి ఆమె ఒక నిర్మాత కూడా. ఏది ఏమైనా అడివి శేష్, సుప్రియ ఫ్యాన్స్ కి ఈ ఫోటో ద్వారా హింట్ ఇచ్చారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. అక్కినేని ఫ్యామిలీ క్రిస్టమస్ వేడుకల్లో నాగ చైతన్య మిస్ అయ్యాడు. చైతు ఎక్కడ అని కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారు.