- Home
- Entertainment
- శృతి హాసన్ తో అలా చేయడం నచ్చక..కసి పెంచుకుని 5 బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో ఎవరో తెలుసా
శృతి హాసన్ తో అలా చేయడం నచ్చక..కసి పెంచుకుని 5 బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో ఎవరో తెలుసా
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టినవారే ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ బ్యాంగ్ గ్రౌండ్ దృష్ట్యా నేరుగా హీరోలు అయిపోయి ఉండొచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టినవారే ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ బ్యాంగ్ గ్రౌండ్ దృష్ట్యా నేరుగా హీరోలు అయిపోయి ఉండొచ్చు. కానీ చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు చిన్న చిన్న వేషాలు వేస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఆ కోవకి చెందిన హీరోనే అడివి శేష్. పంజా, బాహుబలి, బలుపు లాంటి చిత్రాల్లో అడివి శేష్ నెగిటివ్ రోల్స్ లో నటించాడు. మరికొన్ని చిత్రాల్లో కూడా ప్రాధాన్యత లేని పాత్రలు చేశాడు. అయితే అడివి శేష్ గోల్ అది కాదు. మంచి నటుడిగా, హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనేది శేష్ కోరిక. కానీ ఇష్టం లేని పాత్రలు చేస్తూ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాను అనే అంతర్మధనం అడివిశేష్ లో మొదలైంది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన బలుపు చిత్రంలో అడవి శేష్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ఆ చిత్రంలో తన పాత్ర ఏమాత్రం నచ్చలేదని అడివి శేష్ తెలిపాడు. ఇండస్ట్రీకి వచ్చి ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నానా అని నలిగిపోయాడట. ఆ చిత్రంలో నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. కానీ నా పాత్ర ఉపయోగం లేని పాత్ర అని అడివిశేష్ తెలిపాడు.
గోపీచంద్ మలినేని, రవితేజ లాంటి వారితో పరిచయమే తనకు ఆ చిత్రంలో కలిగిన ప్రయోజనం అని శేష్ తెలిపాడు. హీరోయిన్ శృతి హాసన్ ని లాక్కుని వెళుతూ సీన్స్ చేశాను. అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు నాపై నాకే అసహ్యం వేసింది. దీనితో బలుపు చిత్రం తర్వాత నేను మారాలి అని ఆలోచించడం మొదలు పెట్టా. ఈలోపు బాహుబలి వచ్చింది చేశా.
ఆ తర్వాత కసితో అన్నీ ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేశా. ఫుల్ లెన్త్ హీరోగా 5 చిత్రాలు చేశాను. ఆ 5 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. క్షణం చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పింది. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా ఐదు చిత్రాలు చేశాను. నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది అని అడివి శేష్ తెలిపాడు. ప్రస్తుతం శృతి హాసన్, అడివి శేష్ కలసి డెకాయిట్ అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు.
పంజా లాంటి చిత్రాలు చేస్తున్నప్పుడు నన్ను ఎవరూ తెలుగు అబ్బాయి లాగా గుర్తించలేదు. నా పేస్ చూసి వీడెవడో నార్త్ ఇండియన్ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను నార్త్ ఇండియన్ అనుకుని హిందీలో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను తెలుగు వాడినే సార్ అని చెప్పినట్లు అడివిశేష్ సరదాగా పేర్కొన్నారు.