- Home
- Entertainment
- Devatha: దేవుడమ్మకు రుక్మిణిని గుర్తుకు చేసిన దేవి.. కూతురిని చెస్ ఛాంపియన్ గా చూడాలనుకుంటున్నాను ఆదిత్య!
Devatha: దేవుడమ్మకు రుక్మిణిని గుర్తుకు చేసిన దేవి.. కూతురిని చెస్ ఛాంపియన్ గా చూడాలనుకుంటున్నాను ఆదిత్య!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది ఈ సీరియల్. ఇక ఈరోజు జులై 11వ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆదిత్య (Adithya) రాధకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడుతాడు. తమ కూతురు దేవి (Devi) కి ఆటలో మంచి పట్టుదల ఉంది అని తెలుసుకోవడంతో రాధ మరింత సంతోషపడుతుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను మాధవ చాటున వింటాడు.
ఇక వీళ్లిద్దరూ ఏం చేస్తున్నారు అని.. ఫోన్లోనే కాకుండా నేరుగా కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు అని అనుమాన పడతాడు. ఇక మాధవ (Madhava) నిచూసి అక్కడికి రామమూర్తి రావటంతో ఎందుకిలా ఉన్నావు అని అడుగుతాడు రామమూర్తి (Rama Moorthi). పిల్లల స్కూల్ గురించి ఆలోచిస్తున్నాను అని సరిదిద్దుతాడు.
ఓవైపు దేవి, ఆదిత్య (Adithya) చెస్ ఆడుతూ ఉంటారు. అందులో దేవి నెగ్గుతూ ఉంటుంది. అప్పుడే దేవుడమ్మ వచ్చి కాసేపు సరదాగా మాట్లాడి భోజనం చేయమని అనడంతో.. ఇప్పుడు వద్దు మళ్లీ తింటాను అని దేవి అనటంతో వెంటనే అదే మాట గతంలో తనతో అన్న రుక్మిణి (Rukmini) ని గుర్తుకు చేసుకుంటుంది దేవుడమ్మ.
ఇక ఆ తర్వాత ఆదిత్య (Adithya) దేవికి చెస్ గురించి చెబుతుంటాడు. మరోవైపు దేవుడమ్మ తన గదిలో తన భర్తతో దేవి (Devi) గురించి పంచుకుంటుంది. తన తీరు, తను మాట్లాడేది చూస్తుంటే రుక్మిణి గుర్తుకు వస్తుంది అని అంటుంది. కానీ ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరికీ తేడా ఉంది అని.. పైగా తను రామ్మూర్తి మనవరాలు అని అంటాడు.
మాధవ మాత్రం రాధ (Radha) గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవి (Devi) ని ఆదిత్యకు దగ్గరగా చేస్తుందని.. తన దగ్గర చాలా తెలివి ఉందని అనుకుంటాడు. ఇక దేవిని అక్కడ నుండి ఎలాగైనా ఇంటికి రప్పించాలని ప్లాన్ చేస్తాడు. వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి తన కూతురు తను రమ్మంటే రాదని.. చదువు విషయంలో డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇంటికి పంపించేలా చేయండని అంటాడు.
దాంతో ఆమె.. ఇదివరకే ఆదిత్య (Adithya) ఫోన్ చేశారు అని జూనియర్ చెస్ కాంపిటీషన్లో దేవిని ఆడించాలి అని అనుకుంటున్నాడని.. దీని వల్ల మీకే కాకుండా మా స్కూల్ కి కూడా మంచి పేరు వస్తుంది.. కాబట్టి అక్కడే ఉండటం మంచిది అని అనటంతో మాధవ (Madhava) ఫోన్ కట్ చేసి కోపంతో రగిలిపోతాడు.
ఆ తర్వాత సమయంలో అక్కడ ఉన్న రాధ (Radha) తీరుని చూసి మళ్ళీ కోప్పడి అక్కడి నుంచి వెళుతుంది. మళ్లీ ఆటలో లీనం అవుతారు తండ్రి కూతుర్లు. ఆ సమయంలో అక్కడికి దేవుడమ్మ భోజనం తీసుకుని వస్తుంది. ఇక మాటల్లో దేవి (Devi) ఆదిత్యను నాయనా అని పిలవడంతో ఇద్దరు షాక్ అవుతారు. దేవి పొరపాటు పడ్డాను అని మళ్లీ సారు అని పిలుస్తుంది.