ప్రభాస్ గురించి అందరూ అనుకునేది నిజం కాదు.. కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్!
హీరోయిన్ కృతి సనన్ అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. ఆదిపురుష్ మూవీలో జానకి పాత్ర చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కృతి సనన్ హాజరయ్యారు.

Kriti Sanon
ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రభాస్-కృతి సనన్ కలిసి నటించిన ఈ పౌరాణిక చిత్రం ఐదు భాషల్లో జూన్ 16న విడుదల కానుంది. దీంతో డివోషనల్ సిటీ తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
Kriti Sanon
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు నిర్మాతలు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిధులుగా ఆదిపురుష్ ఈవెంట్ కి హాజరయ్యారు.
Kriti Sanon
జానకిగా కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కృతి సనన్ హాజరయ్యారు. ఆమె నల్లని డిజైనర్ శారీలో నిండుగా కనిపించారు. చందమామలా మెరిశారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కృతి సనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ... నా కెరీర్ తెలుగులోనే మొదలైంది. 9 ఏళ్ల తర్వాత మరలా తెలుగులో సినిమా చేస్తున్నాను. జానకి పాత్ర చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. అందుకు ఓం రౌత్, ప్రభాస్ లకు ధన్యవాదాలు. ఆ పాత్ర నన్ను ఎంచుకుంది నేను భావిస్తున్నాను. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది, అన్నారు.
Kriti Sanon
ఆదిపురుష్ సెట్లో ఒక ప్రశాంత వాతావరణం ఉంది. సాధారణంగా సినిమా సెట్స్ లో గోల గోలగా ఉంటుంది. ఆదిపురుష్ మూవీ సెట్ అందుకు పూర్తి భిన్నం. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. అందుకే నిశ్శబ్దంగా ఉండేవారు. ఆ వాతావరణం నాకు ఎంతగానో నచ్చింది, అని కృతి అన్నారు. అనంతరం ప్రభాస్ గురించి చెప్పాలని యాంకర్ ప్రదీప్ కృతి సనన్ కి కోరారు. ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్. ఫుడ్ బాగా ఇష్టపడతారు. ఆయన పెద్దగా మాట్లాడరని అందరూ అంటుంటారు. అది నిజం కాదు. ప్రభాస్ చాలా బాగా మాట్లాడతారు. ఆయన కళ్ళల్లో ఓ ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్ర ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరని ప్రశంసలు కురిపించారు. కాగా కృతి సనన్, ప్రభాస్ మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ వినిపించిన నేపథ్యంలో కృతి సనన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కృతి సనన్ గతంలో వన్ నేనొక్కడినే, దోచేయ్ చిత్రాల్లో కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చారు. జానకి పాత్రలో కృతి సనన్ అద్భుతంగా ఉన్నారు.
Kriti Sanon
ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. మూవీపై భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్ డే ఆదిపురుష్ రికార్డు వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Kriti Sanon
కాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు కోట్లలో ఖర్చు చేస్తున్నారట. కేవలం బాణా సంచా కోసం రూ. 50 లక్షలు కేటాయించారట. ఇక ఈవెంట్ నిర్వహణకు మొత్తంగా రూ. 2.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం అందుతుంది.