MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Actress Vahini: తీవ్ర విషాదం, నటి వాహిని కన్నుమూత.. ప్రాణాంతక వ్యాధి చికిత్సకు డబ్బు లేకపోవడంతో మరణం

Actress Vahini: తీవ్ర విషాదం, నటి వాహిని కన్నుమూత.. ప్రాణాంతక వ్యాధి చికిత్సకు డబ్బు లేకపోవడంతో మరణం

ప్రముఖ బుల్లితెర నటి వాహిని మరణించారు. పిన్న వయసులోనే ఆమె మరణం అందరినీ విషాదంలో ముంచేసింది. తనకి ఉన్న ప్రాణాంతక వ్యాధి చికిత్సకి డబ్బు లేకపోవడం వల్ల వాహిని కన్నుమూశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 05 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి వాహిని మరణం
Image Credit : Asianet News

నటి వాహిని మరణం

ప్రముఖ సినీ బుల్లితెర నటి వాహిని అలియాస్ పద్మక్క (48) విషాదకర పరిస్థితుల్లో కన్ను మూశారు. నటి వాహిని ఎక్కువగా బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులని అలరించారు. కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. వాహిని మరణ వార్తతో ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాహిని మరణం చాలా విషాదకర పరిస్థితుల్లో జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ వ్యాధితో బాధపడుతున్న వాహిని
Image Credit : instagram.com/jayavahneie

ఆ వ్యాధితో బాధపడుతున్న వాహిని

గత కొంతకాలంగా వాహిని రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది విషమంగా మారడంతో వైద్యానికి అధిక మొత్తంలో డబ్బు అవసరం అయింది. వైద్యానికి అవసరమైన డబ్బు లేకపోవడం, ఇంతలో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రోజు వాహిని మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ప్రకటించారు.

Related Articles

Related image1
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
Related image2
విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా
35
భావోద్వేగానికి గురైన నటి కరాటే కళ్యాణి
Image Credit : instagram.com/jayavahneie

భావోద్వేగానికి గురైన నటి కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణికి వాహినితో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే వాహిని ఇల్లు ఉండేది అని కరాటే కళ్యాణి పేర్కొంది. వాహిని మరణంతో కరాటే కళ్యాణి ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ పెట్టారు. 'వాహిని (పద్మక్క) అక్కానిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తనజన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది.. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని ఉరికి తీసుకువెళ్ళిపోయారు అంట.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సద్గతి ఓం శాంతి. వి మిస్ యు. పద్మక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు.

45
విషమించిన ఆరోగ్యం
Image Credit : instagram.com/jayavahneie

విషమించిన ఆరోగ్యం

నటి వాహిని 1978లో విజయనగరంలో జన్మించారు. సినిమాల్లో, బుల్లితెరపై నటిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా వాహిని రొమ్ము క్యాన్సర్ తో బుధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. రొమ్ము క్యాన్సర్ ఎక్కువ కావడంతో ఆమె మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. దీనితో ఐసియులో ఉంచి వైద్యం అందించారు. కీమోథెరపీ, ఐసియు పర్యవేక్షణ కోసం వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి.

55
అంత ఖర్చు భరించలేక..
Image Credit : instagram.com/jayavahneie

అంత ఖర్చు భరించలేక..

రూ.35 లక్షల వరకు డబ్బు ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలిపారు. ఆంత మొత్తం భరించే స్థితిలో ఆమె కుటుంబం లేదు. దీనితో పద్మక్క వైద్యానికి సాయం చేయాలి అని గతంలో కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా అభిమానులని, సినీ ప్రముఖుల్ని అడిగారు. కొంత మంది వారికి తోచిన విధంగా సాయం చేశారు. కానీ డబ్బు సరిపోలేదు. ఇంతలో వాహిని ఆరోగ్యం పూర్తిగా విషమంగా మారింది. ఇక కష్టం అని, ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు తేల్చేశారు. దీనితో ఆమె బుధవారం తన స్వస్థలం విజయనగరంలో మరణించారు. నటి వాహిని సీరియల్స్ తో పాటు నటుడు నరేష్ రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
Recommended image2
విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved