శ్రీదేవి బట్టలపై దారుణంగా కామెంట్స్ చేసిన సీనియర్ నటి, నాతో ఆమెని పోల్చకండి అంటూ..
అతిలోక సుందరి శ్రీదేవి దక్షణాదితో పాటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 80వ దశకం నుంచే శ్రీదేవి హవా సౌత్ లో మొదలయింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారంతా శ్రీదేవితో పోటీ పడాల్సి వచ్చింది.

అతిలోక సుందరి శ్రీదేవి దక్షణాదితో పాటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 80వ దశకం నుంచే శ్రీదేవి హవా సౌత్ లో మొదలైంది. అప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారంతా శ్రీదేవితో పోటీ పడాల్సి వచ్చింది. 80వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుజాత, శ్రీదేవి మధ్య అప్పట్లో పోటీ ఉండేదట. ఈ పోటీ వల్ల ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
Sridevi
సుజాత శోభన్ బాబుతో తెలుగులో గోరింటాకు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. చంటి చిత్రంలో ఆమె వెంకటేష్ కి తల్లిగా నటించారు. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న టైంలో ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి ప్రస్తావన వచ్చింది. శ్రీదేవి మీకు పోటీగా ఎదుగుతోంది అని ప్రశ్నించగా.. సుజాత ఫైర్ అయ్యారు. శ్రీదేవి ధరించే బట్టలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Sridevi
దయచేసి నాతో శ్రీదేవిని పోల్చకండి. ఆమెకి నా అంత స్థాయి లేదు. మినీ స్కర్ట్ లు, పొట్టి గౌనులు ధరించే శ్రీదేవికి నాతో పోటీ ఏంటి. ఆమె ఎప్పటికీ నాతో సమానం కాదు అంటూ సుజాత ఫైర్ అయ్యారట. ఈ విషయం శ్రీదేవికి తెలిసింది. ఆమె కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు.
Sujatha
ఆ టైంలో శ్రీదేవి ప్రేమాభిషేకం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుజాత వ్యాఖ్యలకు వెంటనే శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారట. సుజాత కామెంట్స్ గురించి విన్నాను. మినీ స్కర్ట్స్ వేసుకున్నంత మాత్రాన హీరోయిన్ కాదు అని అనడం, ధరించే బట్టల గురించి ఇలా ఆమె మాట్లాడడం నాకు నచ్చలేదు. సుజాత కూడా మలయాళీ చిత్రంలో సింగిల్ టవల్ కట్టుకుని నటించింది. మరి దాని గురించి ఆమె మాట్లాడలేదు ఎందుకు ? అని శ్రీదేవి ప్రశ్నించారు.
Sujatha
హీరోయిన్ గా ఉన్నప్పుడు దర్శకుడి కథ ప్రకారం బట్టలు వేసుకోవాలి. ఆ విషయం సుజాతకి తెలియదా ? సుజాత పట్ల నేను ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు. నా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారట.