MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో కోసం 7 రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి..ఇంతకీ ఎవరా హీరో..?

స్టార్ హీరో కోసం 7 రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి..ఇంతకీ ఎవరా హీరో..?

తనతో కలిసి అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఒక స్టార్  నటుడి కోసం 7 రోజులు ఉపవాసం ఉండి పూజ చేశారట  శ్రీదేవి. ఇంతకీ ఎవరా నటుడు..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 26 2024, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నటి శ్రీదేవి

నటి శ్రీదేవి

శ్రీదేవి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆరాధించే నటి. లేడీ సూపర్ స్టార్‌గా చాలా సంవత్సరాలు వెలుగొందిన ఆమె, తన సినీ జీవితంలో అనేక భాషల్లో  అనేక సూపర్ హిట్ నటులతో కలిసి పనిచేశారు. అలాంటి కొద్దిమంది నటులతో ఆమెకు మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, తెర వెనుక కూడా మంచి అనుబంధం ఉండేది. అలాంటి ఒక నటుడి కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు.

అంతేకాకుండా శ్రీదేవి ఆ నటుడి కోసం ఆలయంలో పూజ కూడా చేశారట. ఆ నటుడు మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. శ్రీదేవితో ఒకటి కాదు, రెండు కాదు, అనేక భాషల్లో 20కి పైగా చిత్రాలలో ఆయన నటించారు.

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రజనీ

రజనీ

ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, రజనీకాంత్ ఆరోగ్యం కోసం శ్రీదేవి ఇదంతా చేశారట. 2011లో ప్రముఖ నటుడు రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న శ్రీదేవి, షిరిడీ సాయిబాబా పేరు మీద ఉపవాసం ఉన్నారు.

రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు. పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు.

2011లో రజనీకాంత్ ఆరోగ్యం చాలా దిగజారినప్పుడు, ఆయన రవికుమార్ దర్శకత్వంలో రానా సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అయితే, శ్రీదేవి ఉపవాసం, అందరి అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ తిరిగి ఆరోగ్యం పొందారు.

34
రజనీకాంత్

రజనీకాంత్

రజనీకాంత్, శ్రీదేవి కలిసి అనేక చిత్రాలలో నటించారు, వాటిలో చాలా బ్లాక్‌బస్టర్‌లు. మూండ్రు ముడిచు, నాన్ ఆడిమై ఇల్లై, పోకిరి రాజా, భగవాన్ దాదా, షల్బాస్ వంటి చిత్రాలు వారు కలిసి నటించిన మెగాహిట్ చిత్రాలు. శ్రీదేవి తన 15వ ఏట రజనీకాంత్‌తో కలిసి పనిచేశారు.

ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. అయినప్పటికీ, ఈ ఇద్దరు స్టార్స్ మధ్య స్నేహం ఎప్పటిలాగే ఉంది.

44
రజనీ, శ్రీదేవి

రజనీ, శ్రీదేవి

శ్రీదేవితోనే కాదు, ఆమె తల్లితో కూడా మంచి అనుబంధం పెంచుకున్నారు రజనీకాంత్. తొలినాళ్లలో కమల్ హాసన్ లాగా నేను కూడా మంచి నటుడిగా, ఆయనలా మంచి పారితోషికం తీసుకుంటానా అని శ్రీదేవి తల్లి దగ్గర తరచుగా బాధపడేవారట రజనీకాంత్. దానికి కలత చెందకు నాయనా, నువ్వు కమల్ హాసన్ కంటే మంచి నటుడిగా ఎదుగుతావని చాలాసార్లు ఆయనను ఆశీర్వదించారట శ్రీదేవి తల్లి.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Jhansi: పాటలు పాడితే ఆపేశారు, ఎలిమినేషన్‌ అన్‌ఫెయిర్‌.. ట్రోల్స్ పై సింగర్‌ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్‌, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved