- Home
- Entertainment
- శోభన సినిమాలు మానేయడానికి ఆ స్టార్ హీరోనే కారణమా? ఆ వేధింపులు తట్టుకోలేక సినిమాలకు గుడ్ బై ?
శోభన సినిమాలు మానేయడానికి ఆ స్టార్ హీరోనే కారణమా? ఆ వేధింపులు తట్టుకోలేక సినిమాలకు గుడ్ బై ?
ఇటీవల పద్మభూషణ్ గ్రహీత శోభన కెరీర్ పీక్ టైమ్‌లోనే సినిమాలు ఎందుకు మానేసింది. ఆమెని వేధించిన హీరోలు ఎవరు? షాకిచ్చే విషయాలు బయటకు వచ్చాయి.

హీరోయిన్ శోభన ఇటీవల `కల్కి 2898 ఏడీ` శంబాలా అమ్మగా కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటించిన సినిమా ఇది. అయితే ఆమె సినిమాలు మానేయడానికి కారణమేంటి? ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటుందనేది చూస్తే, షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడానికి ఓ స్టార్ హీరో కారణమట.
Veteran actress Shobana
కేరళాకి చెందిన సీనియర్ హీరోయిన్ శోభన క్లాసిక్ డాన్స్ కి కేరాఫ్‌గా నిలిచే ట్రావిన్ కోర్ సిస్టర్స్(లలిత, పద్మిని, రాగిని) వారసురాలు. వాళ్లు క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే కాదు, నటీమణులు కూడా. చాలా సినిమాలు చేశారు.
వారి వారసురాలిగా శోభన మూడేళ్ల వయసులోనే బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలోనే హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తెలుగులో ఆమె 1982లో `భక్త ధృవ మార్కండయ` చిత్రంలో బాల నటిగా సునీతా దేవి పాత్రలో నటించింది శోభన.
తెలుగులో ఆమె టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, నరేష్, రాజశేఖర్ వంటి హీరోలతో కలిసి నటించింది. రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే 1997 తర్వాత శోభన సినిమాలు మానేసింది. కరెక్ట్ గా పదిహేనేళ్లు బిజీగా ఉంది.
స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. హీరోయిన్‌గా పీక్ లో ఉన్న సమయంలోనే ఆమె ఎందుకు సడెన్‌గా సినిమాలు మానేసింది. దానికి కారణం చాలా మంది హీరోలు ఆమెని వేధించడట. చాలా రకాలుగా హీరోలు శోభనని ఇబ్బంది పెట్టారని, దీంతో ఇక్కడ ఉండటం కష్టమని భావించిన ఆమె సినిమాలు మానేసిందని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు.
Shobana
అయితే ఆమె తెలుగులో ఎక్కువగా హీరో రాజేంద్రప్రసాద్‌తో గొడవ పడేదట. ఆయనతో ఇకపై తాను నటించనని అప్పట్లో తెగేసి చెప్పినట్టుగా వినిపించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇక తాను సినిమాల్లోనే నటించనని తెగేసి చెప్పిందట.
ఆ సంచలన నిర్ణయం వెనుక ఆమె ఎన్ని బాధలు పడిందో అన్నారు రామారావు. రాజేంద్రప్రసాద్ తాలూకు ధోరణులు శోభనకు నచ్చేవి కావని, అందుకే సినిమాల్లో చేయనని ఆయన చెప్పినట్టుగా రామారావు తెలిపారు. సినిమాలపైనే తనకు ఏవగింపు కలిగిందని, అందుకే ఆమె సినిమాలను వదిలేసిందని చెప్పారు.
Shobana
పవిత్రమైన కళ డాన్స్ ని నేర్చుకుంది. క్లాసికల్స్ డాన్సెస్ అన్నీ నేర్చుకుంది. ఇండియాలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తిరిగి డాన్స్ షోస్ చేసింది. గొప్ప పేరు సంపాదించింది.
ఏకంగా కేంద్రప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డుని కూడా అందుకుంది. సినిమాల్లో వచ్చే డబ్బు కంటే తనకు డాన్స్ ద్వారా వచ్చే గుర్తింపు, గౌరవం, కీర్తినే ఎక్కువగా భావించింది శోభన. అందుకే ఆమె డాన్స్ కే పరిమితమయ్యిందన్నారు.
అయితే సినిమాలు మానేసి తర్వాత కూడా అప్పుడప్పుడు ఒకటి అర సినిమాల్లో మెరిసింది శోభన. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. `కల్కి 2898 ఏడీ`లో కీలక పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు బాలయ్య `అఖండ 2`లో కూడా నటించబోతుంది. ఇదిలా ఉంటే ఇటీవల శోభనకి కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2006లోనే పద్మ శ్రీ అవార్డుని అందుకుంది.
తెలుగులో శోభన నటించిన చిత్రాలు చూస్తే.. `విక్రమ్`, `అజేయుడు`, `మువ్వ గోపాలుడు`, `త్రిమూర్తులు`, `రుద్రవీణ`, `అభినందన`, `నారి నారి నడుమ మురారి`, `నేటి సిద్ధార్థ`, `అల్లుడుగారు`, `ఏప్రిల్ 1 విడుదల`, `అప్పుల అప్పారావు`, `రౌడీ గారి పెళ్లాం`, `మైనర్ రాజా`, `రౌడీ అల్లుడు`, `అల్లుడు దిద్దిన కాపురం`, `అసాధ్యలు`, `కన్నయ్య కిట్టయ్య`, `నిప్పు రవ్వ`, `రక్షణ` వంటి మూవీస్ ఆమె నటించిన చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
read more: సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్? త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
also read: `ఆర్‌సీ16`టీమ్‌కి రామ్ చరణ్ కండీషన్.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?