MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • భర్తతో విడాకులు తీసుకోబోతున్న నటి సంగీత.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే.. అసలేం జరిగిందంటే?

భర్తతో విడాకులు తీసుకోబోతున్న నటి సంగీత.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే.. అసలేం జరిగిందంటే?

నటి సంగీత తన భర్త క్రిష్‌తో విడాకులు తీసుకోబోతుందనే రూమర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 07 2025, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సంగీత
Image Credit : Instagram/Sangitha

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సంగీత

హీరోయిన్‌ సంగీత తెలుగులో `ఖడ్గం` సినిమాతో మంచి బ్రేక్‌ అందుకుంది. ఆ తర్వాత బిజీ హీరోయిన్‌ అయిపోయింది. `పెళ్లాం ఊరెళితే`, `ఆయుధం`, `టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌`, `ఖుషీ ఖుషీగా`, `విజయేంద్ర వర్మ`, `సంక్రాంతి`, `నా ఊపిరి`, `అదిరిందయ్యా చంద్రం`, `బహుమతి` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది సంగీత. అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

DID YOU
KNOW
?
చిరుతో స్టెప్పులు
నటి సంగీత మెగాస్టార్‌ చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో స్టెప్పులేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`సరిలేరు నీకెవ్వరు`తో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన సంగీత
Image Credit : Instagram/Sangitha

`సరిలేరు నీకెవ్వరు`తో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన సంగీత

ఆ తర్వాత కొంత కాలం తెలుగు సినిమాలకు గ్యాపిచ్చింది. పెళ్లి తర్వాత కొంత సెలక్టీవ్‌గా వెళ్లింది.  మహేష్‌ బాబు హీరోగా వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన సంగీత వరుసగా సినిమాలు చేస్తుంది. అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తోంది. `మసూద`తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. `ఆచార్య`లో టెంపుల్‌ సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమాలతో కాకుండా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. ఆమె విడాకులు తీసుకోబోతుందనే వార్త నెట్టింట దుమారం రేపుతుంది.

Related Articles

Related image1
అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
Related image2
ఆ లేడీ యాంకర్‌ నాపై చేతబడి చేయించింది.. ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు బయటపెట్టిన యాంకర్‌ రవి
35
సంగీత విడాకుల రూమర్స్ వైరల్‌
Image Credit : Instagram/Sangitha

సంగీత విడాకుల రూమర్స్ వైరల్‌

సంగీత సోషల్‌ మీడియా అకౌంట్లలో తన భర్త పేరుని తొలగించడంతో ఈ రూమర్లు విస్తరించాయి. ఇన్‌ స్టాగ్రామ్‌లో సంగీత క్రిష్‌ నుంచి సంగీత యాక్టర్ గా మార్చుకున్నారని, దీంతో భర్తతో రిలేషన్‌ చెడిందా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు ఈ లాజిక్‌ని తీసి నెట్టింట డైవర్స్ రూమర్స్ క్రియేట్‌ చేశారు. అంతేకాదు ఇటీవల 1990 స్టార్స్ అందరు గెట్‌ టూ గెదర్‌ అయ్యారు. ఇందులో సంగీత భర్త లేరు. ఒంటరిగానే కనిపించింది. దీంతో ఈ రూమర్స్ ని మరింత బలంగా నమ్ముతున్నారు.

45
విడాకుల రూమర్స్ పై సంగీత క్లారిటీ
Image Credit : Instagram/Sangitha

విడాకుల రూమర్స్ పై సంగీత క్లారిటీ

ఈ క్రమంలో తాజాగా దీనిపై నటి సంగీత స్పందించింది. రూమర్స్ పై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్ లో నిజం లేదని, మొదట్నుంచి తన పేరుని ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీత యాక్టర్‌ అని ఉంచుకున్నట్టు తెలిపింది. దీంతో విడాకులకు రూమర్స్ కి చెక్‌ పెట్టింది. తాము కలిసే ఉన్నట్టు ఆమె స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2009లో హీరోయిన్‌ సంగీత.. ప్లే బ్యాక్‌ సింగర్‌ క్రిష్‌ని వివాహం చేసుకుంది. తిరువన్నమలైలోని అరుచలేశ్వర టెంపుల్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది.

55
`పరదా`తో రాబోతున్న సంగీత
Image Credit : Instagram/Sangitha

`పరదా`తో రాబోతున్న సంగీత

సంగీతం నటిగానే కాదు, టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. గతంలో ఆమె `జోడీ నెంబర్‌ 1`, `డాన్స్ జోడీ డాన్స్`, `సూపర్‌ జోడీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె `పరదా` చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తుండగా, ఆమెకి సపోర్టింగ్‌గా సంగీత కనిపించబోతున్నారు. ఆమెది బలమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sangitha Santharam (@sangitha.act)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
Recommended image2
ఆ లేడీ యాంకర్‌ నాపై చేతబడి చేయించింది.. ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు బయటపెట్టిన యాంకర్‌ రవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved