- Home
- Entertainment
- నన్ను కూడా రేవ్ పార్టీకి పిలిస్తే బావుండేది అనుకున్నా..అలాంటి పనులు చేసి దొరికిపోతే, రీతూ చౌదరి కామెంట్స్
నన్ను కూడా రేవ్ పార్టీకి పిలిస్తే బావుండేది అనుకున్నా..అలాంటి పనులు చేసి దొరికిపోతే, రీతూ చౌదరి కామెంట్స్
ఇటీవల చిత్ర పరిశ్రమని కుదిపేసిన రేవ్ పార్టీ సంఘటనపై రీతూ చౌదరి స్పందించింది. రేవ్ పార్టీ గురించి రీతూ చౌదరి ఫన్నీగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rithu Chowdary
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.
Rithu chowdary
రీతూ చౌదరి ప్రస్తుతం దావత్ అనే షోకి హోస్ట్ గా చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలతో ఫన్నీగా, చిలిపిగా ఇంటర్వ్యూలు చేస్తోంది. బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి అనేక విషయాలు రాబడుతోంది. ఆమెకి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్ గా రీతూ చౌదరి ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటించింది.
Rithu Chowdary
ఇటీవల చిత్ర పరిశ్రమని కుదిపేసిన రేవ్ పార్టీ సంఘటనపై రీతూ చౌదరి స్పందించింది. రేవ్ పార్టీ గురించి రీతూ చౌదరి ఫన్నీగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో నేను రేవ్ పార్టీకి నన్ను కూడా ఎవరైనా ఇన్వైట్ చేస్తే బావుంటుంది అనుకునేదాన్ని. ఎందుకంటే రేవ్ పార్టీ అంటే ఏంటో నాకు తెలియదు. అది కూడా సాధారణంగా ఎంజాయ్ చేసే పార్టీ అనుకున్నా.
Rithu Chowdary
కానీ ఇప్పుడు రేవ్ పార్టీ గురించి తీసుకుంటుంటే షాకింగ్ గా అనిపిస్తోంది. రేవ్ పార్టీ అంటే ఇదా అని అనుకుందట. ఇప్పటికి రేవ్ పార్టీ గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ డ్రగ్స్ లాంటి వ్యవహారాలు వినిపిస్తున్నాయి. అలాంటి పార్టీలకు వెళ్లడం అవసరం లేదు అని ఫిక్స్ అయ్యా.
రేవ్ పార్టీ అంటే చాలా చెడు విషయాలు ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పూర్తిగా కాకున్నా తెలుసుకున్నంత వరకు చూసుకుంటే అలాంటి పార్టీలు నిర్వహించడమే నేరం అనిపిస్తోంది. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే మనల్ని మనం సమర్థించుకోలేం. సమర్థించుకున్నా తప్పే అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న వారు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు అని తెలిపింది.
ఇటీవల బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీ సంఘటనలో నటి హేమ పేరు తెరపైకి వచ్చింది. ఆమె విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా పంపారు. కానీ హేమ విచారణకు హాజరు కాలేదు.