- Home
- Entertainment
- Rakul Preet : రెడ్ మిర్చీ ఘాటులా రకుల్ ప్రీత్ గ్లామర్ షో.. స్టన్నింగ్స్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్నబ్యూటీ
Rakul Preet : రెడ్ మిర్చీ ఘాటులా రకుల్ ప్రీత్ గ్లామర్ షో.. స్టన్నింగ్స్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్నబ్యూటీ
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) వీకెండ్ వచ్చిందంటే ట్రెండీ వేర్ లో నెట్టింట గ్లామర్ ఘాటును వెదజల్లుంది. లేటెస్ట్ అవుట్ ఫిట్స్ లో అభిమానులకు ఊహించని ట్రీట్ ఇస్తోంది. రకుల్ లేటెస్ట్ పిక్స్ తో వారిని ఖుషీ చేస్తోంది.

బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడి వెదర్ కు తగ్గట్టుగానే ఫ్యాషన్ పై ఫోకస్ పెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ నార్త్ ఆడియెన్స్ తో పాటు, నెటిజన్లకు మరింత దగ్గరవుతోంది.
ఫ్యాషన్ డిజైన్ లోని కొత్తదనాన్ని ప్రదర్శించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఎల్లప్పుడూ ముందుంటోంది. తన ఫ్యాషన్ ఫోటోషూట్‌లతో ఆకట్టుకోవడంలో రకుల్ ప్రీత్ రూటే సపరేట్ అని చెప్పాలి. ఎలాంటి అవుట్ ఫిట్ అయినా తన ఫిట్ నెస్ బాడీకి అద్దినట్టుగా ఉండాల్సిందే. ఈ మేరకు రకుల్ ఫ్యాషన్ ఎంపిక కూడా తన అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది.
వీకెండ్ సందర్భంగా నిన్న రకుల్ ప్రీత్ సింగ్ పార్టీ వేర్ రెడ్ బాడీకాన్ డ్రెస్ లో మతిపోగొడుతోంది. ఎర్రటి దుస్తుల్లో ఎర్ర మిర్చిలా ఘాటు అందాలను వెదజల్లుతోంది. తన గ్లామర్ ముందు నెటిజన్లు నిలవలేకపోతున్నారు. అదిరిపోయే డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ.
ఇటీవల వారంలో కనీసం రెండుసార్లైనా తన అభిమానులను లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోందీ ఫిట్ నెస్ బ్యూటీ. ఊహించని విధంగా తాజాగా అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రీత్ ఈ ఫొటోషూట్ ను ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ది హౌస్ ఆఫ్ ఎక్సోటిక్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఫోటోషూట్ కోసం రెడ్ బాడీకాన్ ఫుల్ స్టీవ్ డ్రెస్ ను ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. స్టిమ్ ఫిట్ అందాలు కనిపించేలా ధరించిన డ్రెస్ లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకున్న ఫిట్ నెస్ బ్యూటీ.. ఫొటోలకు ‘రెడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవల తన ఫొటోషూట్లలో ఎంచుకుంటున్న అవుట్ ఫిట్స్ ఎక్కువగా ఎరుపు రంగువయ్యే ఉంటున్నాయి. దీంతో తమ అభిమాన నటీకి ఎరుపంటేనే ఇష్టమని భావిస్తున్నారు.
కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ మంచి ఊపులో ఉంది. వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే తను నటించిన చిత్రం ‘ఎటాక్’ రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 29న ‘రన్ వే34’(Runway 34) కూడా విడుదల కానుంది. మరోవైపు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక టాలీవుడ్ ను ఊపూపిన ఈ బ్యూటీ.. తెలుగులో అజిత్ కుమార్ (Ajith Kumar) సరసన నటించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.