- Home
- Entertainment
- Raashi Khanna Comments : బాడీ షేమింగ్ పై స్పందించిన రాఖీ ఖన్నా.. తనను అలా పిలిచేవారంట..!
Raashi Khanna Comments : బాడీ షేమింగ్ పై స్పందించిన రాఖీ ఖన్నా.. తనను అలా పిలిచేవారంట..!
హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది పెద్ద సమస్యే. అలా బాడీ షేమింగ్ పై కామెంట్లు చేసినప్పుడు వారి మనస్సు ఎంత బాధపడుతోందో.. ఎవరూ ఊహించి ఉండరు. అయితే, తాజాగా బాడీ షేమింగ్ పై రాశీఖన్నా స్పందిస్తూ.. తనకు కలిగిన ఇబ్బందిని తెలియజేసింది.

అందం, అభినయంలో అచ్చు తెలుగమ్మాయిని పోలి ఉంటుంది రాశీ ఖన్నా (Raashi Khanna). తెలుగు వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి బిగ్ హిట్ అంటూ లేకపోవడం బాధాకరం. అయినా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
తనకు నచ్చితేనే ఏ పాత్రనైనా పోషించేందుకు సిద్ధపడుతుంది. అలాగే తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ ఫిల్మ్ ‘మనం’ చిత్రంలో టాలీవుడ్ కు తన ముఖాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాత ‘ఊహాలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది.
తన ఎత్తు, గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ గుర్తించిన చలన చిత్ర దర్శకనిర్మాతలకు ఈ ఢిల్లీ భామకు వరుస ఆఫర్లు ఇస్తూ వచ్చారు. తను కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాల్లో మెరుస్తూ వచ్చింది. ఇప్పటికే తెలుగులో 18 సినిమాల్లో నటించింది.
రాశీఖన్నా చివరిగా డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాఖీ ఖన్నా ఇప్పుడు స్లిమ్ ఫిట్ అందాలతో ఆడియెన్స్ ను మైమరిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే.
కానీ, కేరీర్ తొలినాళ్లలో ఈ ముద్దుగుమ్మ చాలా బొద్దుగా ఉండేదట. దీంతో దక్షిణాాది చిత్ర పరిశ్రమ వాళ్లు తనపై బాడీ షేమింగ్ కామెంట్లు చేసేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రకరకలా పేర్లతో పిలిచేవారని, ఒకనోక దశలో గ్యాస్ ట్యాంకర్ అని కూడా పిలిచే వాళ్లని తెలిపింది. దీంతో చాలా బాధగా ఉండేదని చెప్పింది.
ఆ తర్వాత హీరోయిన్ గా రాణించాలంటే బరువు తగ్గాలని గుర్తించినట్టు తెలిపింది. అప్పటి నుంచి తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ రెగ్యూలర్ గా జిమ్ కు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం.
కేరీర్ విషయానికొస్తే తొమ్మిదేండ్ల తర్వాత రాశీ ఖన్నా హిందీలో ‘రుద్ర వెబ్’ సిరీస్ చేసింది. అలాగే తెలుగులో ‘థ్యాంక్ యు’, హిందీలో ‘యోధ’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో ఈ ఏడాది ఏకంగా నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. ప్రస్తుతం రుద్ర (Rudra) వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.