- Home
- Entertainment
- Priyanka Mohan Latest Pics : ప్రియాంక మోహన్ నవ్వితే గుండె జారితే గల్లంతే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Priyanka Mohan Latest Pics : ప్రియాంక మోహన్ నవ్వితే గుండె జారితే గల్లంతే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్... సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. తను పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని నటించిన‘గ్యాంగ్ లీడర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా పర్లేదు అనిపించుకోవడంతో.. ప్రియాంకకు కూడా తెలుగులో మంచి గుర్తింపు దక్కింది.
తన బ్యూటీతో తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ప్రియాంక అరుళ్ మోహన్. ఆమెను అచ్చమైన తెలుగు హీరోయిన్ అనుకున్నారంతా. దాంతో వెంటనే మరో సినిమా అవకాశం దక్కించుకుంది. శర్వానంద్ తో శ్రీకారం చేసే ఛాన్స్ వచ్చింది ప్రియాంకకు.
శర్వానంద్ కు జోడీగా ‘శ్రీకారం’ సినిమాలోనూ నటించింది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమాతో పెద్దగా ప్రియాంకకు ఒరిగిందేమీ లేదని చెప్పాలి. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోయినా.. అటు తమిళం నుంచి ప్రయత్నాలు చేస్తోందీ బ్యూటీ.
అయితే తను తెలుగులో నటించిన రెండు సినిమాలకు గ్లామర్ లోనూ, నటనలోనూ మంచి మార్కులు పడ్డాయి. తమిళంలోనూ గతేడాది తన కేరీర్ ను ప్రారంభించింది. తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీతో తమిళ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఈ సినిమాతో తెలుగులో వచ్చిన రెస్పాన్సే అక్కడా వచ్చింది.
దీంతో రిలీజ్ కు రెడీ ఉన్న ‘ఈటీ’ మూవీలో, మరోవైపు ‘డాన్’ తమళ మూవీల్లో అవకాశం అందుకుంది. అయితే ప్రియాంక మోహన్ కు సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నా.. పెద్దగా హిట్ మాత్రం లేకపోయింది. దీంతో మార్చి 10న రిలీజ్ కాన్నున్న ‘ఈటీ’పైనా ఆశలు పెట్టుకుంది.
ఈ మూవీ ఇటు తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది. అయితే ‘ఈటీ’మూవీ కోసం ప్రియాంక చాలానే కష్టపడినట్టు తెలుస్తోంది. అటు సీన్లలోనూ.. డ్యాన్స్ పైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిందంట. ఇదే విషయాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశాడు. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతో తన ఫాలోవర్స్.. అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది.