- Home
- Entertainment
- ప్రియాంక మోహన్ సండే ట్రీట్ అదిరింది.. చారల సూట్ లో సూపర్ స్టైలిష్ పోజులు.. తమిళ బ్యూటీకి కుర్రాళ్లు ఫిదా..
ప్రియాంక మోహన్ సండే ట్రీట్ అదిరింది.. చారల సూట్ లో సూపర్ స్టైలిష్ పోజులు.. తమిళ బ్యూటీకి కుర్రాళ్లు ఫిదా..
తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తన ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సండే స్పెషల్ ట్రీట్ అందిస్తూ.. సూపర్ స్టైలిష్ గా ఫొటోషూట్ చేసింది. ప్రియాంక న్యూ లుక్ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ తన సినీ రంగ ప్రవేశాన్ని కన్నడ చిత్రంతో పూర్తి చేసుకుంది. ‘ఒంద్ కతే హెల్లా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళంలోనే వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ హీరోయిన్ గా పేరొందింది.
అయితే తను నటించిన తమిళ చిత్రాలు తెలుగులోనూ రిలీజ్ అవుతుండటంతో ఈ బ్యూటీ ఇటు తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలానే దగ్గరవుతోంది. తన అందం, అభినయంతో ప్రియాంక మోహన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
టాలీవుడ్ కు నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నేరుగా ఒక్క చిత్రమే చేసిన ప్రియాంకకు మాత్రం ఆడియెన్స్ నుంచి వంద శాతం మార్కులు పడ్డాయి. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిన.. ప్రియాంకకు పాపులారిటీని తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తోందీ బ్యూటీ. అయితే తను నటించి చిత్రాల్లో ఎక్కడా గ్లామర్ షోకు మాత్రం ఒప్పుకోలేదీ బ్యూటీ. హోమ్లీ హీరోయిన్ గా ప్రస్తుతానికి మంచి పేరుంది. కానీ స్టార్ డమ్ ను తెచ్చిపెట్టే ఒక్క సినిమా ఇంత వరకు అందలేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
అయితే, ఈ బ్యూటీ అటు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. ఎక్కువగా తన లేటెస్ట్ ఫొటోషూట్లతో పలకరిస్తూ ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ పిక్స్ లో ప్రియాంక చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. అభిమానులకు సండే ట్రీట్ ఇస్తూ ఇలా ట్రెండీగా ఫొటోషూట్ చేసింది. చారల సూట్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనిపించే ప్రియాంక తాజాగా సూట్ లో కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఆమె పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ప్రియాంక తన పాపులారిటీని పెంచుకునేందుకు సోషల్ మీడియాలో నిర్విరామంగా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోలకు కాస్తా దూరంగా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవల ఫ్యాషన్ సెన్స్ తో మాత్రం ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ గా, ట్రెండీగా దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోందీ బ్యూటీ.
ప్రియాంక ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తను నటించిన ‘డాక్టర్’, ‘డాన్’ చిత్రాలు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. చివరిగా తమిళ సూపర్ స్టార్ సూరియా (Suriya) సరసన ‘ఈటీ’లో నటించి అలరించింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఎలాంటి అప్డేట్ రాలేదు.