- Home
- Entertainment
- శారీలో మెరిసిపోతున్న నాని హీరోయిన్.. హాఫ్ షోల్డర్ బ్లౌజ్ లో ప్రియాంక మోహన్ అందాల విందు
శారీలో మెరిసిపోతున్న నాని హీరోయిన్.. హాఫ్ షోల్డర్ బ్లౌజ్ లో ప్రియాంక మోహన్ అందాల విందు
తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లేటెస్ట్ ఫొటోషూట్లతో తన క్రేజ్ పెంచుకుంటోంది. అటు సినిమాల్లోనూ విభిన్నపాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ తొలుత కన్నడలో ‘ఒంద్ కతే హెల్లా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈ సుందరి నటన, గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
నేచురల్ స్టార్ నానితో (Nani)తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడినా.. ప్రియాంక అరుళ్ మోహన్ కు మాత్రం మంచి గుర్తింపును తెచ్చింది. ఆ వెంటనే హీరో శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’లో నటించింది. రెండు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య సరసన ‘ఈటీ’లో నటించింది. ఈ చిత్రం కూడా అవరేజ్ గా ఆడటంతో ప్రియాంకకు సరైన బ్రేక్ పడటం లేదు. మంచి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తోందీ బ్యూటీ.
అయితే తాజాగా ప్రియాంక మోహన్ ‘గలాట్టా అవార్డ్స్ 2022’ ఈవెంట్ కు హాజరైంది. మే 8న ఈ ఈవెంట్ జవహర్ లాల్ నెహ్రూ ఇండూర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2021 -2022కు సంబంధించి బెస్ట్ నటీనటులు, టెక్నీషియన్స్, ఇతరులకు అవార్డులను ప్రదానం చేశారు.
ప్రియాంక అరుళ్ మోహన్ గతేడాది రిలీజ్ అయిన ‘డాక్టర్’ సినిమాలో శివకార్తీకేయ సరసన నటించిన విషయం తెలిసిందే. ఇందుకు గాను బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫీమేల్ విభాగంలో అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా పలు ఫొటోలకు పోజులిచ్చింది. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో ప్రియాంక చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. హాఫ్ షోల్డర్ బ్లౌజ్ లో గ్లామర్ షో చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది. నెట్ శారీలో ఈ ముద్దుగుమ్మ అందాల విందుకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.