MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లైన ఉపేంద్రతో లవ్‌ ఎఫైర్‌.. ఓపెన్‌ అయిన నటి ప్రేమ.. అసలేం జరిగింది?

పెళ్లైన ఉపేంద్రతో లవ్‌ ఎఫైర్‌.. ఓపెన్‌ అయిన నటి ప్రేమ.. అసలేం జరిగింది?

సీనియర్‌ నటి ప్రేమలో తెలుగులో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. `దేవి`చిత్రంతో పాత్రలతో పాపులర్‌ అయిన ఆమె హీరో ఉపేంద్రతో ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై ప్రేమ ఓపెన్‌ అయ్యారు.  

2 Min read
Aithagoni Raju
Published : Apr 15 2023, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చిన కన్నడ నటి ప్రేమ మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నారు. శివరాజ్‌ కుమార్‌తో `సవ్యాసాచి` చిత్రంలో నటించారు. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. రెండో చిత్రం `ఓం` ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్‌కుమార్‌తోనే నటించారు. ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది దీంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది ప్రేమ. ఇలా ఉపేంద్ర దర్శకత్వంలో అనేక చిత్రాలు చేశారు. అలాగే శివరాజ్‌కుమార్‌, దిగ్గజ నటుడు విష్ణువర్థన్‌తో ఎక్కువ సినిమాలు చేశారు. 

26

ఇదిలా ఉంటే కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు చాలా వరకు ఉపేంద్ర దర్శకత్వం, ఆయనతోనూ పలు సినిమాలు చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అటు కన్నడలోనే కాదు, తెలుగులోనూ వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటి ప్రేమ స్పందించారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌(సుమన్‌ టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దీనిపై ఓపెన్‌ అయ్యారు.

36

ఉపేంద్రతో లవ్‌ ఎఫైర్‌ గురించి చెబుతూ, ఆ విషయం రాసిన వాళ్లనే అడగాలన్నారు. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, ఎక్కువగా కలిసి పనిచేసినప్పుడు ఇలాంటి రూమర్స్ కామనే అని, వాటిని పట్టించుకోవద్దన్నారు. తాను ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదన్నారు. రాసిన వాళ్లు ఎవరూ తనని సంప్రదించలేదని, అలా చేసి ఉంటే బాగుండేదన్నారు. అయినా దీన్ని తాను లైట్‌ తీసుకున్నట్టు చెప్పారు. దీనిపై ఉపేంద్రతోనూ మాట్లాడలేదని తెలిపారు. 
 

46

మరోవైపు ఊపేంద్ర డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా కచ్చితమైన డైరెక్టర్‌ అని, సహజత్వానికి పెద్ద పీటవేస్తారని, లేడీ ఆర్టిస్టు, మేల్‌ ఆర్టిస్ట్ అనే తేడా చూపించరని, తనకు కావాల్సిన ఔట్‌ పుల్‌ వచ్చేంత వరకు వదలరు అని తెలిపింది. హీరోయిన్లని లాగి కొట్టాలంటే అలానే చేయాలని, ఏదో పైపైన చేస్తే ఒప్పుకునేవారు కాదన్నారు. నేచురాలిటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, సహజమైన ఎమోషన్స్ వచ్చేంత వరకు ఆయన ఆర్టిస్టులను వదలరు. దీంతో ఆ సమయంలో చాలా బాధగా అనిపించేందని, ఏంటీ ఈయన పెద్ద శాడిస్టా అనే ఫీలింగ్‌ కూడా కలిగిందన్నారు. 
 

56

కానీ ఉపేంద్రతో పనిచేయడం వల్ల నటిగా చాలా నేర్చుకున్నామని, ఇంకా స్ట్రాంగ్‌గా మారామని, తమ నటన మెరుగుపర్చుకునే అవకాశం దక్కిందన్నారు. అలాగే విష్ణువర్థన్‌తో నటించేటప్పుడు నటిగా క్రమశిక్షణ నేర్పించేవారని, ఆయన్నుంచి గొప్ప లెసన్స్ పొందామన్నారు. శివరాజ్‌కుమార్‌ కూడా అంతే అన్నారు. వీళ్లు గొప్ప యాక్టర్స్ అని, వీరితో పనిచేయడం వల్లే తాము నటులుగా ఇంప్రూవ్‌ అయినట్టు చెప్పారు ప్రేమ. 
 

66

తెలుగులో `ధర్మచక్రం, `దేవి,` `ఓంకారం`, `మా ఆవిడ కలెక్టర్‌,` `పోలీస్‌ పవర్‌`, `ధీర్ఘ సుమంగళి భవ`, `రాయలసీమ రామన్న చౌదరీ`, `దేవి పుత్రుడు`, `చిరునవ్వుతో రా` వంటి చిత్రాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. సౌందర్యాకి సమకాలీకురాలిగా మెప్పించారు. ముఖ్యంగా దేవి పాత్రలు ఆమెకి విశేషం గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే తాను డబ్బుకు ఏరోజు ప్రయారిటీ ఇవ్వలేదని, మంచి పాత్రలకే ప్రయారిటీ ఇచ్చినట్టు చెప్పారు. నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుని సెలక్టీవ్‌గా చేశానని చెప్పారు. మళ్లీ మంచి పాత్రలతో తెలుగులోకి వస్తానని వెల్లడించారు. తనకు క్యాన్సర్‌ అనే వార్తలో నిజం లేదని, కేవలం పుకారు మాత్రమే అన్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
Recommended image2
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
Recommended image3
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved