- Home
- Entertainment
- Pranitha Subhash : శుభవార్త చెప్పిన నటి ప్రణీత.. ఆనందంలో మునిగి తేలుతోంది.. నేలపై కాలుపెట్టనంటున్న బాపుబొమ్మ..
Pranitha Subhash : శుభవార్త చెప్పిన నటి ప్రణీత.. ఆనందంలో మునిగి తేలుతోంది.. నేలపై కాలుపెట్టనంటున్న బాపుబొమ్మ..
పవన్ కళ్యాణ్ హీరోయిన్, నటి ప్రణీత సుభాష్ (Pranitha) తన భర్త పుట్టిన రోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. పెండ్లైయినా ఏడాదిలోపే శుభవార్త చెప్పి... ఆనందంలో మునిగి తేలుతోంది. భర్తపైకెక్కి నేల దిగనంటూ మారం చేస్తోందీ బ్యూటీ..

తెలుగులో కొన్ని సినిమాలే చేసింది నటి ప్రణీత. అయినా గుర్తుండిపోయే పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ సుందరి.
గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తవ్వలేదు. కానీ ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ఈ ఫొటోల్లో ప్రణీత భర్తను గట్టిగా హగ్ చేసుకుని పట్టలేని సంతోషంతో కనిపిస్తోంది. అవధుల్లేని ఆనందంలో మునిగి తేలుస్తోంది. నితిన్ ను టైట్ గా హగ్ ఇళ్లంతా తిప్పేసింది. తల్లి కాబోతున్న ఆనందంలో భర్త పైకెక్కి నేలదిగనంటూ మారం చేసింది.
ఈ సందర్భగా తన చేతిలో స్కానింగ్ కు సంబంధించిన ఎక్స్ రే కాపీలను చూపిస్తూ కాన్సీవ్ అయినట్టుగా తెలిపింది. భర్త నితిన్ 34వ పుట్టిన రోజు సందర్భంగా ప్రణీత ఈ గుడ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకుంది. ‘నా భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా, పైన ఉన్న దేవదూతలు మాకు బహుమతిని ఇచ్చారు’అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
శుభవార్త తెలిపిన ప్రణీతకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెట్టారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ప్రెగ్నెన్సీతో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రణీత కూడా గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.