MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆడాళ్ళు దాన్ని స్వార్ధానికి వాడేస్తున్నారు... అబార్షన్ పై పూనమ్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆడాళ్ళు దాన్ని స్వార్ధానికి వాడేస్తున్నారు... అబార్షన్ పై పూనమ్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు

అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్రీలు పునరుత్పత్తి సామర్థ్యాన్ని స్వార్ధానికి వాడుతున్నారంటూ విమర్శించారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 30 2022, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ అబార్షన్ పై సంచలన తీర్పు చెప్పింది. ఒంటరి మహిళలు, పెళ్లికాని స్త్రీలకు కూడా అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. గర్భం దాల్చిన స్త్రీలు పిల్లల్ని కనాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు వారికి ఉందన్నారు. సురక్షితమైన విధానంలో అబార్షన్ చేయించుకునే హక్కు పెళ్లికాని, ఒంటరి స్త్రీలకు కల్పించారు. 
 

25

ఈ తీర్పు పై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె తీర్పుకు మద్దతు ఇస్తూనే కొందరు ఆడవాళ్ళ తీరును తప్పుబడ్డారు.  గర్భం దాల్చిన ప్రతి మహిళకు బిడ్డను కనాలా? లేదా? అని నిర్ణయించుకునే హక్కు ఉంది.  చాలా మంది ఆడవాళ్లు గర్భం దాల్చడం సామాజిక, ఆర్థిక భద్రత గా భావిస్తున్నారు. బయట ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న మగాళ్లను రిలేషన్ కి కట్టుబడి ఉండేలా చేయడానికి గర్భాన్ని వాడుతున్నారు. ఆడవాళ్లు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తమ స్వార్థ ప్రయోజాలకు ఉపయోగించకూడదు, మతపరమైన సంస్థలు అబార్షన్ ని తప్పుడు చర్యలకు వాడుతున్నారని, అన్నారు  
 

35


పూనమ్ కౌర్ చేసిన ఈ వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.మరి పూనమ్ స్త్రీ జాతిపై ఇంత పెద్ద అపవాదు వేయగా మహిళా సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇక తరచుగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆమె పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు ఆమె పోస్ట్స్ ఉంటాయి. 
 

45


ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైరికల్ పోస్ట్స్ వేస్తూ ఉంటారు. పూనమ్ చర్యలు నచ్చని పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడుతూ ఉంటారు. పూనమ్ పర్సనల్ గా, పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. 

55

అప్పట్లో హీరోయిన్ గా కంటే వివాదాలతోనే పూనమ్ ఫేమస్ అయ్యాడు. అప్పట్లో కత్తి మహేష్.. పూనమ్-పవన్ రిలేషన్ బయటపెడుతూ సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీయగా పూనమ్ పేరు మారుమ్రోగింది. అప్పటి వరకు కనీస గుర్తింపు లేని పూనమ్ మీడియా కథనాలతో పాప్యులర్ అయ్యారు. ఆ వివాదం తర్వాత నుండే పూనమ్ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ ఉంటారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Recommended image2
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే
Recommended image3
Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved