నరేష్ కు పబ్లిక్ గా ముద్దు పెట్టిన పవిత్ర లోకేష్, వైరల్ అవుతున్న వీడియో
చాలా కాలంగా ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ వస్తున్నారు పవిత్ర లోకేష్ - నరేష్ లు. వివాదాస్పంద వ్యాఖ్యలు .. వివాదాస్పద పనులతో... లైమ్ లైన్ లో ఉంటూ వస్తున్న ఈ కపుల్ .. తాజాగా మరోసారి హాట్ హాట్ పనులతో హాట్ టాపిక్ అయ్యారు.
pavitra lokesh and naresh
చాలా కాలంగా సహజీవనం చేస్తు... టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అనిపించుకుంటున్నారు. సీనియర్ నటీనటులు నరేష్, పవిత్ర లోకేష్. అసలు వీళ్లు పెళ్లి చేసుకున్నారా..? ఏక కలిసి జీవిస్తున్నారా..? లేక ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్టుగా టాక్ వినిపించింది. కాని చేసుకోలేదంటారు కొందరు.
Naresh - Pavitra Lokesh
నటుడు నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మాత్రం ఇది రెండే పెళ్ళి. అయితే గత కొద్ది రోజుల నుండి నరేష్, పవిత్రల విషయంలో రకరకాల వర్తలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి. గత కొద్ది కాలంగా వీరి గురించి పెద్దగా వార్తలు రావడంలేదు.. కాస్త విషయం సైలెంట్ అయ్యింది అని అనుకుంటుండగా.. తాజాగా మరోసారి ఇద్దరు స్టార్లు వార్తల్లోకి వచ్చేవారు.
పబ్లిగ్గా నరేష్ బుగ్గ మీద పవిత్రా లోకేష్ ముద్దు పెట్టి.. హాట్ టాపిక్ అయ్యాడు.. సోషల్ మీడియాకు మంచి స్టఫ్ అందించారు. అదీ చాటు మాటుగా ప్రయివేటుగా ముద్దు పెట్టుకోలేదు. ఓ టీవీ షోలో తమతో పాటు ఉన్న నటీనటుల ముందు ప్రేమను ఇలా వ్యక్తం చేశారు. ఇంతకీ ఇదంతా జరిగింది ఓ టీవీషోలో.. అది కూడా అన్ని కెమెరాలు.. అంత మంది కో స్టార్లు.. ఆడియన్స్ ఉన్న చోట
కేవలం ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు. ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.. నరేష్, పవిత్ర. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈటీవీ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ రూపొందించిన స్వామి రా రా' కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. తమ ప్రేమను వ్యక్తం చేయడం, డ్యాన్స్ చేయడమే కాదు... ముద్దుగా ఏమని పిలుస్తారు అనేది కూడా చెప్పేశారు.
ఇలా మరోసారి ముద్దు వార్తలోలో హైలెట్ గా నిలిచారు నరేష్ - పవిత్ర లోకేష్. అంతే కాదు.. గతంలో కూడా వీరిద్దరు మళ్లీ పెళ్లి సినిమా టైమ్ లో లిప్ లాక్ ఇచ్చుకుంటూ.. రిలీజ్ చేసిన వీడియో, ఫోటోలు నెట్టింట సంచలనంగా మారాయి. ఇక తాజాగా ప్రోగ్రామ్ లో వీరు చేసిన సందడి మరోసారి రచ్చగా మారింది.