- Home
- Entertainment
- Kriti Shetty Pics : సోషల్ మీడియాలో కృతి శెట్టి దూకుడు.. ఇన్ స్టా ఫ్యామిలీని పెంచేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ
Kriti Shetty Pics : సోషల్ మీడియాలో కృతి శెట్టి దూకుడు.. ఇన్ స్టా ఫ్యామిలీని పెంచేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) ఇన్ స్టా ఫ్యామిలీని పెంచేస్తుంది. సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహరిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఇన్ స్టా ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఉప్పెన Uppena మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసిందీ సుందరి. అదే ఊపులో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
కృతి శెట్టి ఇక వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఉప్పెన తర్వాత ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని (Nani) సరసన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఏకంగా నానితో రొమాన్స్ సీన్స్ లో అదరగొట్టింది.
ఆ తర్వాత గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో సర్పంచ్ నాగలక్ష్మి పాత్రను చక్కగా పోషించింది. వరుసగా ఈ మూడు చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. దీంతో కృతి శెట్టి హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
ప్రస్తుతం కృతి శెట్టి పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు తన క్రేజ్ సినిమా సినిమాకు పెరిగిపోవడంతో అవకాశాలు కూడా వరుస కడుతున్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’, సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచెర్ల నియోజకవర్గం’లో నటిస్తోంది.
అయితే, అటు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ కృతి శెట్టి తన పాపులారిటీని పెంచేస్తోంది. తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 3 మిలియన్ కు చేరుకుంది. దీంతో వారిందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కృతి. ఇక ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటూ..లేటెస్ట్ ఫొటోషూట్లతో వారిని ఖుషీ చేస్తోందీ బ్యూటీ.
తన ఇన్ స్టా ఫ్యామిలీ 3 మిలియన్ కు చేరుకున్న సందర్భంగా కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కృతి గులాబీ పువ్వును చూపిస్తూ.. కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. ట్రెండీ వేర్ లో నెటిజన్లను మైమరిపిస్తోందీ బ్యూటీ. కృతి పోస్ట్ చేసిన ఫొటోస్ కొద్ది క్షణాల్లో లక్షకు పైగా లైక్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.