ట్రాన్స్ ఫరెంట్ శారీలో బేబమ్మ మెరుపులు.. వొంపుల నడుముతో మతులుపోగొడుతున్న కృతి శెట్టి
హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) సోషల్ మీడియాలో వరుస ఫొటోలను షేర్ చేస్తోంది ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది.
హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో యంగ్ బ్యూటీ తన హవా కొనసాగిస్తోంది. ఇటీవల కాలంలో కాస్తా జోరు తగ్గినా సినిమా ఆఫర్లు మాత్రం దక్కుతున్నాయి.
టాలీవుడ్ లోకి కృతిశెట్టి ‘ఉప్పెన’లా దుసుకొచ్చింది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాతో ‘బేబమ్మ’గా బిరుదు పొందింది.
ఆ తర్వాత కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలు కూడా వరుస విజయాలను తెచ్చిపెట్టాయి. దీంతో హ్యాట్రిక్ బ్యూటీగా ఇండస్ట్రీలో ముద్ర వేసుకుంది. దాంతో కృతికి మరింతగా ఆఫర్లు అందాయి.
బేబమ్మకు కొద్దిరోజులుగా కాలం కలిసి రావడం లేదు. ఒక హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకోగానే.. ఆ వెంటనే మరో హ్యాట్రిక్ డిజాస్టర్ ను అందుకుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ’మాచర్ల నియోజకవర్గం‘, ‘ది వారియర్’ చిత్రాలు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
ఇక రీసెంట్ గా ‘కస్టడీ’తో కాస్తా మంచి రిజల్ట్ అందుకుంది. కానీ పెద్దగా ఫలితం లేదనే అంటున్నారు. మళ్లీ బేబమ్మ దారిలోకి రావాలంటే తప్పకుండా సాలిడ్ హిట్ పడాల్సిందేనని, లేదంటే గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు.
ఇదిలా ఉంటే.. కృతి శెట్టి మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది.
యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఎక్కువగా సందప్రదాయ దుస్తుల్లోనే మెరిసేందుకు ఇష్టపడుతుంది. ఈ క్రమంలో తాజాగా చీరకట్టులో వెలిగిపోయింది. శారీలో ఒంపుసొంపులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది.
మరోవైపు బేబమ్మ గ్లామర్ విందు కూడా చేసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నడుము, నాభీ అందాలు ప్రదర్శించింది. బ్యాక్ అందాలనూ చూపిస్తూ.. మతులుపోయేలా ఫోజులిచ్చింది. బేబమ్మ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.