- Home
- Entertainment
- నటి కస్తూరికి 100 కోట్ల విలువైన ఇళ్లు.. పుట్టుకతోనే రిచ్.. బోల్డ్ స్టార్ రాయల్ లైఫ్
నటి కస్తూరికి 100 కోట్ల విలువైన ఇళ్లు.. పుట్టుకతోనే రిచ్.. బోల్డ్ స్టార్ రాయల్ లైఫ్
ఇటీవల బిజెపిలో చేరిన నటి కస్తూరికి చెన్నైలో 100 కోట్ల విలువైన ఇల్లు ఉందట. అంతేకాదు ఆమె ఆస్తుల వివరాలు ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి.

నటి కస్తూరి శంకర్ ఆస్తుల వివరాలు
1990లలో పాపులర్ నటిగా వెలుగొందిన కస్తూరి, చెన్నైలోని ఎథిరాజ్ కాలేజీలో చదువుకునే సమయంలోనే 1991లో 'ఆత్తా ఉన్ కోయిలిలే' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత వరుసగా `రాసాతి వారమ్ నాళ్`, ప్రభుతో జంటగా `చిన్నవార్`, `గవర్నమెంట్ మాప్పిళ్లై`, `ఉణ్ణై ఊంజలాడుగిరతు`, `అభిరామి`, `సెంథమిళ్ పట్టు` వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించింది.
నటి కస్తూరి సినీ ప్రయాణం
కాలేజీలో చదువుకునేటప్పుడే మోడలింగ్‌పై దృష్టి సారించిన కస్తూరి, 1992లో మిస్ చెన్నై అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఫెమినా మిస్ మద్రాస్ బ్యూటీ పేజెంట్ వంటి అందాల పోటీల్లో కూడా పాల్గొని విన్నర్ గా నిలిచింది. నటి కస్తూరి సినిమాల్లో రాణించడానికి ఆమె తల్లిదండ్రులే ప్రధాన కారణం. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కస్తూరి, పుట్టుకతోనే ధనవంతురాలైన కుటుంబంలో జన్మించింది.
నటి కస్తూరి కుటుంబం
నటి కస్తూరి తల్లి సుమతి న్యాయవాది, ఆమె తండ్రి పేరు శంకర్, ఆయన ఇంజనీర్. చదువులో తెలివైనప్పటికీ, నటి కస్తూరికి మోడలింగ్ రంగంలో ఎక్కువ ఆసక్తి ఉండేదట. అందుకే ఆమె నటి కావాలనుకుంది. తల్లి న్యాయవాది కావడంతో కస్తూరిని చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలిగా పెంచారు. అందుకే ఆమె తన మనసులోని మాటను బహిరంగంగా చెబుతుంది. దీని కారణంగానే చాలా సార్లు వివాదాల్లో చిక్కుకుంది.
బిజెపిలో చేరిన కస్తూరి
51 ఏళ్ల కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సమస్యలపై నిరంతరం గళం విప్పుతూ వచ్చింది. ఇన్నేళ్లుగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉన్న కస్తూరి, ఇటీవల బిజెపిలో చేరింది. నటి కస్తూరికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త పేరు రవికుమార్. ఆయన వైద్యుడు. కస్తూరి కుమారుడి పేరు సంకల్ప్, కుమార్తె పేరు శోభిని.
కస్తూరి ఇంటి విలువ
కస్తూరి భర్త కూడా ధనవంతులైన కుటుంబానికి చెందినవారట. ఆమెకి చెన్నైలో సొంతంగా ఒక విలాసవంతమైన(లగ్జరీ) ఇల్లు ఉంది. దాని విలువ 108 కోట్ల రూపాయలట. ఈ ఇల్లు చెన్నై ఆల్వార్‌పేటలోని కస్తూరి రంగన్ రోడ్డులో ఉందట. నటి కస్తూరి సినిమాల్లో నటించడానికి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందట. అలాగే సీరియల్‌లో నటించడానికి ఒక్కో ఎపిసోడ్‌కు 30 వేల వరకు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రాయల్ లైఫ్‌ని చూసింది కస్తూరి.